
దేశంలో మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు పెరుగుతూనే ఉన్నాయి. కఠిన చట్టాలు తీసుకోచ్చిన కామాంధుల్లో మార్పు రావడం లేదు. నిత్యం ఏదో ఒక చోట దారుణలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా నిజామాబాద్ జిల్లాలో మతిస్థిమితం లేని బాలికపై ఇద్దరు వ్యక్తులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. బాలిక తల్లిదండ్రులు చనిపోవడంతో పెద్దనాన్న ఇంట్లో ఉంటుంది. బాలికపై పెద్ద నాన్న అత్యాచారం చేశాడు. ఆయనకు తోడు ఆ కుటుంబంతో పరిచయం ఉన్న ఏఆర్ హెడికాస్టేబుల్ కూడా అత్యాచారానికి పాల్పడ్డాడు.
ఈ క్రమంలోనే బాలిక గర్భం దాల్చింది. ఈ విషయం బయటపడంతో పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. విచారణ చేపట్టారు. కాగా, ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.