రేపు సాగర్ లో కాంగ్రెస్ మీటింగ్‌కి హాజరు కాను: రేవంత్‌కి కోమటిరెడ్డి షాక్

Published : Apr 28, 2022, 02:54 PM ISTUpdated : Apr 28, 2022, 03:14 PM IST
రేపు సాగర్ లో కాంగ్రెస్ మీటింగ్‌కి హాజరు కాను: రేవంత్‌కి కోమటిరెడ్డి షాక్

సారాంశం

ఈ నెల 29న నాగార్జున సాగర్ లో జరిగే కాంగ్రెస్ పార్టీ సన్నాహక సమావేశానికి తాను హాజరు కావడం లేదని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు.కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కార్యక్రమంలో తాను పాల్గొనేందుకు వెళ్తున్నట్టుగా చెప్పారు.  

హైదరాబాద్: ఈ నెల 29న Nagarjuna Sagar లో నిర్వహించే Congress పార్టీ సన్నాహక సమావేశానికి తాను హాజరు కావడం లేదని  భువనగరి ఎంపీ Komatireddy Venkat Reddy చెప్పారు.

ఈ ఏడాది మే 6న వరంగల్ లో జరిగే Rahul Gandhi  సభకు జన సమీకరణ కోసం జిల్లాల వారీగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం సన్నాహక సమావేశాలు నిర్వహిస్తుంది. రెండు రోజుల క్రితం Nalgonda సన్నాహాక సమావేశం రద్దైంది. తమకు తెలియకుండానే  సమావేశం నిర్వహించడంపై  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, uttam kumar Reddy అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే నాగార్జునసాగర్ లో రేపు సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకొన్నారు. అయితే ఈ సమావేశానికి తాను హాజరు కావడం లేదని  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు. ఈ నెల 29న కేంద్ర మంత్రి Nitin Gadkari  టూర్ కి తాను వెళ్తున్నానని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు.అయితే తమ పార్టీ నేతలు, కార్యకర్తలను ఈ సమావేశానికి హాజరు కావాలని కోరినట్టుగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు.

 నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందన్నారు. ఎవరూ కూడా నల్గొండకు రావాల్సిన అవసరం లేదని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అభిప్రాయపడ్డారు. పార్టీ బలహీనంగా ఉన్న జిల్లాలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పర్యటించాలని సూచించారు. మాజీ మంత్రి Jana Reddyకి రేవంత్ రెడ్డితో అవసరం ఉందేమో అందుకే రేవంత్ రెడ్డిని పిలిపిస్తున్నారన్నారు. 

సీఎల్పీ నేత  మల్లు భట్టి విక్రమార్కMalu Bhatti Vikramarka రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేయాలని ఆయన సూచించారు.ఈ విషయమై పార్టీ అనుమతి కోసం తాను సోనియాగాంధీకి లేఖ రాస్తానని చెప్పారు.ఈ విషయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా తనతో కలిసి వస్తారన్నారు.  మరో వైపు పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులంతా రాష్ట్రంలో బస్సు యాత్రకు కూడా ప్లాన్ చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఏ పార్టీతో పొత్తు అవసరం లేదన్నారు.

రెండు రోజుల క్రితం రేవంత్ రెడ్డి నల్గొండ జిల్లా కాంగ్రెస్ సన్నాహక సమావేశంలో పాల్గొనాల్సి ఉంది. అయితే ఈ కార్యక్రమం రద్దైంది. తమకు ెతెలియకుండానే సమావేశం నిర్ణయించడంపై అసంతృప్తితో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి,ఉత్తమ్ కుమార్ రెడ్డిలు ఈ కార్యక్రమానికి అడ్డు చెప్పారని సమాచారం. అయితే నల్గొండలో సమావేశం ఏర్పాటు చేయాల్సిందేననే రేవంత్ రెడ్డి డీసీసీని ఆదేశించారు. అయితే పీసీసీ చీఫ్ ను రాకుండా అడ్డు పడడం సరైంది కాదని జానారెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలకు సూచించినట్టు సమాచారం. అయితే మీకు సమయం ఉన్న తేదీన చెబితే అదే రోజున పీసీసీ చీఫ్ జిల్లాలో పర్యటిస్తారని జానారెడ్డి చెప్పారని తెలుస్తుంది. ఈ సమావేశాన్ని తానే నిర్వహించేందుకు ముందుకు వచ్చాడు. నాగార్జునసాగర్ లో సన్నాహక సమావేశానికి నిర్ణయం తీసుకొన్నారు.  అయితే ఈ సమావేశంపై కూడా కోమటిరెడ్డి అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సమావేశానికి తాను హాజరు కాబోనని చెప్పారు. రాహుల్ సభకు జిల్లా ఇంచార్జీగా నియమించిన గీతారెడ్డిని కూడా జిల్లాకు రావొద్దని కూడా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు  చెప్పడంతో ఆమె కూడా తన టూర్ ను రద్దు చేసుకొన్నారు.

PREV
click me!

Recommended Stories

Journalists Arrest : జర్నలిస్టులను ఎందుకు అరెస్ట్ చేశారు.. అసలు ఏమిటీ వివాదం..?
Telangana Rains : తెలంగాణలో వర్షాలు.. సంక్రాంతి పండగవేళ వాతావరణం ఎలా ఉంటుందంటే...