హైదరాబాద్‌కు జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్.. కేసీఆర్‌తో భేటీ అయ్యే ఛాన్స్

Siva Kodati |  
Published : Apr 28, 2022, 03:09 PM ISTUpdated : Apr 28, 2022, 03:13 PM IST
హైదరాబాద్‌కు జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్.. కేసీఆర్‌తో భేటీ అయ్యే ఛాన్స్

సారాంశం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో జేఎంఎం నేత, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ భేటీ కానున్నారు. తల్లి ఆరోగ్యం కోసం హైదరాబాద్‌కు వచ్చిన ఆయన ప్రగతి భవన్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్, మంత్రులు హేమంత్‌కు ఘనస్వాగతం పలికారు.

జేఎంఎం నేత, జార్ఖండ్  సీఎం హేమంత్ సోరెన్ హైదరాబాద్‌ వచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ఆయన సమావేశం కానున్నారు. తన తల్లి వైద్యం కోసం హేమంత్ సోరెన్ హైదరాబాద్‌ చేరుకున్నారు. జాతీయ రాజకీయాలపై కేసీఆర్, హేమంత్ సోరెన్ చర్చలు జరిపే అవకాశం వుంది. 

కాగా.. గత కొంతకాలంగా ఎన్డీయేతర పార్టీలతో సీఎం కేసీఆర్ చర్చలు జరుపుతున్న సంగతి తెలిసిందే . అలాగే బీజేపీకి వ్యతిరేకంగా తన మాటల యుద్ధాన్ని తీవ్రతరం చేశారు. అంతేకాదు ఆయా పార్టీలు, సీఎంలను కూడా కలుస్తున్నారు. ఇప్పటికే తమిళనాడు సీఎం స్టాలిన్, మహరాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రేతో భేటీ అయ్యారు.  బెంగాల్ సీఎం మమత బెనర్జీ కూడా కేసీఆర్ కు ఫోన్ చేశారు. హైద్రాబాద్ కు వచ్చిన సమయంలో కేరళ సీఎం పినరయి విజయన్, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా తదితరులు కేసీఆర్ తో భేటీ అయ్యారు. ఈ క్రమంలోనే గత నెలలో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్‌తో కేసీఆర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జాతీయ రాజకీయాలపై చర్చించారు. 

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమానికి (telangana movement) శిబుసోరెన్ (shibu soren) ఎంతగానో సహరించారని అన్నారు . త్వరలో అందరినీ కలుస్తామని.. దేశానికి ఇప్పుడు కొత్త అజెండా కావాలని కేసీఆర్ ఆకాంక్షించారు. ఇప్పుడే ఏ ఫ్రంట్ లేదని.. ఏదైనా వుంటే చెబుతామని ఆయన పేర్కొన్నారు. తాము ఎవరికి అనుకూలం, వ్యతిరేకం కాదన్న కేసీఆర్.. దేశం బాగు కోసమే తమ ప్రణాళిక అన్నారు. 

గల్వాన్ లోయలో Chinaతో జరిగిన ఘర్షణలో 20 మంది భారత జవాన్లు వీర మరణం పొందిన సంగతి తెలిసిందే. వారిలో తెలంగాణకు చెందిన కల్నల్ Santosh Babu కూడా ఉన్నారు. అయితే సంతోష్ బాబు కుటుంబంతో పాటు, మిగిలిన 19 మంది అమర జవాన్ల కుటుంబాలకు కేసీఆర్ సాయం ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున సంతోష్‌ బాబు కుటుంబానికి రూ. 5 కోట్ల నగదుతోపాటు నివాస స్థలం, ఆయన భార్యకు గ్రూప్‌–1 స్థాయి ఉద్యోగం..  మిగతా 19 మంది అమర జవాన్ల కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికీ రూ. 10 లక్షల చొప్పున అందజేయనున్నట్టుగా చెప్పారు. 

గతంలో సంతోష్ బాబు నివాసానికి వెళ్లిన కేసీఆర్ ప్రకటించిన సాయం అందజేశారు. అలాగే సంతోష్ బాబు భార్య సంతోషికి ఉద్యోగ నియమాక ప్రతాలు అందజేశారు. ఇప్పుడు మిగతా 19 మంది అమర జవాన్లను కుటుంబాలకు కూడా గతంలో ప్రకటించిన విధంగా రూ. 10 లక్షల చొప్పున సాయం అందజేసేందుకు కేసీఆర్ సిద్దమయ్యారు. ఈ క్రమంలోనే జార్ఖండ్‌కు చెందిన ఇద్దరు అమర జవాన్ల కుటుంబాలకు పరిహారం అందజేశారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Journalists Arrest : జర్నలిస్టులను ఎందుకు అరెస్ట్ చేశారు.. అసలు ఏమిటీ వివాదం..?
Telangana Rains : తెలంగాణలో వర్షాలు.. సంక్రాంతి పండగవేళ వాతావరణం ఎలా ఉంటుందంటే...