హైదరాబాద్: ఎక్కడపడితే అక్కడ కొరుకుతూ పైశాచికం... మైనర్ బాలికపై అర్నెల్లుగా అఘాయిత్యం

Arun Kumar P   | Asianet News
Published : Jan 26, 2022, 11:15 AM ISTUpdated : Jan 26, 2022, 11:26 AM IST
హైదరాబాద్: ఎక్కడపడితే అక్కడ కొరుకుతూ పైశాచికం... మైనర్ బాలికపై అర్నెల్లుగా అఘాయిత్యం

సారాంశం

శరీరంపై ఎక్కడ పడితో అక్కడ కొరుకుతూ మైనర్ బాలికకు గత ఆర్నెళ్లుగా నరకం చూపిస్తున్న ఓ దుర్మార్గుడి పాపం పండటంతో కటకటాల పాలయ్యాడు. ఈ ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. 

హైదరాబాద్: అభం శుభం తెలియని ఓ మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడో యువకుడు. అయితే బాలిక ద్వారా విషయాన్ని తెలుసుకున్న కుటుంబసభ్యులు, స్థానికులు సదరు యువకున్ని పట్టుకుని దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన తెలంగాణ రాజధాని నగరం హైదరాబాద్ (hyderabad) లో చోటుచేసుకుంది. 

పోలీసులు, బాధిత కుటుంబం తెలిపిన వివరాలిలా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా (sangareddy district) జహీరాబాద్ ప్రాంతానికి చెందిన మహ్మద్ మోహిజ్(20) హైదరాబాద్ లో వెల్డింగ్ పనులు చేస్తుంటాడు. ఎమ్ఎస్ మక్తాలో ఇతడి అక్కాబావ అద్దెకు వుండటంతో వారివద్దే వుండేవాడు. 

అయితే ఇదే ఇంట్లో మరో కుటుంబం కూడా నివాసముంటోంది. ఇలా పక్క పోర్షన్ లో తల్లిదండ్రులతో కలిసి  వుంటున్న 13ఏళ్ల మైనర్ బాలికపై మోహిజ్ కన్ను పడింది. దీంతో బాలికకు మాయమాటలు చెప్పి దగ్గరయ్యాడు. 

ఇలా బాలికను లోబర్చుకున్న అతడు గత ఆరు నెలలుగా లైంగిక దాడి (sexual harassment)కి పాల్పడుతున్నాడు. అద్దెకుండే ఇంటి టెర్రస్ పైకి తీసుకెళ్లి బాలికపై అఘాయిత్యానికి పాల్పడేవాడు. ఇలా చాలాకాలంగా  వ్యవహారం సాగుతుండగా యువకుడి పాపం పండి తాజాగా ఈ విషయం బయటపడింది. 

బాలిక ఒంటిపై పంటిగాట్లను గమనించిన కుటుంబసభ్యులు నిలదీయగా తనపై జరుగుతున్న అఘాయిత్యం గురించి బయటపెట్టింది. మోహిజ్ తనపై పాల్పడుతున్న పైశాచికం గురించి బాలిక బయటపెట్టడంతో ఆగ్రహించిన కుటుంబసభ్యులు అతడిని పట్టుకుని దేహశుద్ది చేసారు. అనంతరం మోహిజ్ ను పోలీసులకు అప్పగించారు.  

ఇదిలావుంటే విద్యాబుద్దులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడే బుద్దితప్పి విద్యార్థిణితో అసభ్యంగా ప్రవర్తించి కటకటాలపాలైన ఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది. మైనర్ బాలికతో పాటు ఆమె తల్లికి వాట్పాప్ ద్వారా నగ్న ఫోటోలు పంపించి అడ్డంగా బుక్కయ్యాడు సదరు కీచక టీచర్.  

జగిత్యాలకు చెందిన రేగొండ వెంకట సాయి(31) ఓ ప్రైవేట్ స్కూల్లో ఉపాధ్యాయుడిగా పనిచేసేవాడు. ఈ క్రమంలో అదే పాఠశాలకు చెందిన విద్యార్థిణుల ఫోన్ నెంబర్లు సేకరించిన అతడు వారితో అసభ్యకరంగా చాట్ చేసేవాడు. ఈ విషయం విద్యార్థిణుల తల్లిదండ్రులకు తెలిసి స్కూల్ యాజమాన్యానికి ఫిర్యాదు చేసారు. దీంతో అతడిని ఉద్యోగం నుండి తొలగించారు. 

ఇలా తన నీచపు ప్రవర్తనతో ఉద్యోగాన్ని కోల్పోయినా అతడి బుద్ది మాత్రం మారలేదు. ఓ మైనర్ బాలికపై కన్నేసిన వెంకటసాయి ఎలాగోలా ఆమె ఫోన్ నెంబర్ సేకరించాడు. బాలికతో చాటింగ్ చేస్తూ పరిచయం పెంచుకున్నాడు. ఇలా కొంతకాలం ఛాటింగ్ సాగిన తర్వాత తనను ప్రేమిస్తున్నానని బాలికకు వెంకటసాయి చెప్పాడు. దీంతో బాలిక అతడి మెసేజ్ లకు రిప్లై ఇవ్వడం మానేసింది.  దీంతో ఆమెపై కక్ష పెంచుకున్న అతడు దారుణంగా వ్యవహరించాడు. 

బాలికతో పాటు ఆమె తల్లికి నగ్న ఫోటోలు, వీడియోలు పంపించి వేధింపులకు దిగాడు. దీంతో బాధిత కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. దీంతో రంగంలోకి దిగిన సైబర్ క్రైమ్ పోలీసులు సాంకేతిక ఆధారాలతో నిందితుడు వెంకటసాయిని అరెస్ట్ చేసారు. అతడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
 

PREV
click me!

Recommended Stories

Christmas Holidays 2025 : ఒకటి రెండ్రోజులు కాదు... వచ్చే వారమంతా స్కూళ్ళకు సెలవులే..?
IMD Rain Alert : ఓవైపు చలి, మరోవైపు వర్షాలు... ఆ ప్రాంతాల ప్రజలు తస్మాత్ జాగ్రత్త..!