వావివరసలు మరిచిన కామాంధుడు... పేరెంట్స్ ను కోల్పోయిన మైనర్ పై బాబాయ్ అత్యాచారం

By Arun Kumar P  |  First Published Jun 7, 2023, 10:21 AM IST

తల్లిదండ్రులను కోల్పోయిన మైనర్ బాలికను బాబాయ్ వరసయ్యే యువకుడు మాయమాటలతో లొంగదీసుకుని అత్యాచారానికి పాల్పడ్డాడు. 


హైదరాబాద్ : వావివరసలు మరిచిన ఓ కామాంధుడు మైనర్ బాలిక(15) పై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తల్లిదండ్రుల ప్రేమకు దూరమైన బాలికను బాబాయ్ వరసయ్యేవాడు ప్రేమ చూపించాడు. దీంతో అతడు కపట ప్రేమను నమ్మిన బాలిక మాయమాటలకు లొంగిపోయింది. ఇలా బాలికను చిల్డ్రన్ హోం నుండి బయటకు తీసుకెళ్లిన నీచుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన హైదరాబాద్ లో వెలుగుచూసింది. 

వివరాల్లోకి వెళితే... ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన ఓ బాలిక చిన్నవయసులోనే తల్లిదండ్రులు చనపోయారు. దీంతో హైదరాబాద్ లో వుంటున్న అమ్మమ్మ వద్ద బాలిక వుంటోంది. అమ్మమ్మకు కూడా బాలిక పోషణ భారంగా మారడంతో వెంగళరావు నగర్ లోని ఓ చిల్డ్రన్ హోమ్ లో చేర్పించింది. బాలికను చిల్డ్రన్ హోమ్ కు తీసుకువెళ్లే సమయంలో అమ్మమ్మతో పాటు బాబాయ్ వరసయ్యే యువకుడు(29) వెంటవెళ్లారు. 

Latest Videos

అయితే తల్లిదండ్రులు లేని బాలికపై బాబాయ్ వరసయ్యే యువకుడి కన్నుపడింది. తరచూ బాలికను చూసేందుకు చిల్డ్రన్ హోమ్ కు వెళ్ళి ప్రేమగా మాట్లాడేవాడు. తల్లిదండ్రుల ప్రేమకు దూరమైన బాలిక యువకుడి మాయమాటలు నమ్మి దగ్గరయ్యింది. 

Read More  హైద్రాబాద్‌లో డ్రమ్ములో డెడ్‌బాడీ: పురాన్‌సింగ్ ను హత్య చేయించిన మాజీ లవర్

ఇటీవల పరీక్షల సమయంలో చిల్డ్రన్ హోమ్ నుండి బయటకు వచ్చిన బాలికను యువకుడు కలిసాడు. బైక్ పై ఎక్కించుకుని సరదాగా తిరిగిన తర్వాత రహ్మత్ నగర్ లోని తన గదికి తీసుకెళ్లాడు.  బాలికపై లైంగికదాడికి పాల్పడి ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని బెదిరించాడు. 

లైంగికదాడి అనంతరం మళ్ళీ బాలికను బయటకు తీసుకెళ్లిన యువకుడు సెల్ ఫోన్ కొనిచ్చాడు. అనంతరం చిల్డ్రన్ హోమ్ వద్ద దింపేసి వెళ్లిపోయాడు. బాలికకు ఇచ్చిన మొబైల్ కు తరచూ ఫోన్, చాటింగ్ చేస్తుండేవాడు. ఇటీవల బాలిక వద్ద మొబైల్ గుర్తించిన చిల్డ్రన్ హోమ్ సిబ్బంది ఎక్కడిదని నిలదీసారు. దీంతో బాలిక తనపై బంధువుల యువకుడు జరిపిన అఘాయిత్యం గురించి వారికి తెలియజేసింది. 

బాలికపై అత్యాచారం జరిగినట్లు తెలుసుకున్న వెంటనే చిల్డ్రన్ హోమ్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేసారు. నిందితున్ని అరెస్ట్ చేసిన పోలీసులు పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. 

click me!