ఒంటరిగా అక్కాచెల్లెళ్లు : చెల్లిని బంధించి.. అక్కపై అత్యాచారం

Siva Kodati |  
Published : Aug 23, 2019, 10:35 AM ISTUpdated : Aug 23, 2019, 10:36 AM IST
ఒంటరిగా అక్కాచెల్లెళ్లు : చెల్లిని బంధించి.. అక్కపై అత్యాచారం

సారాంశం

హైదరాబాద్‌లో దారుణం జరిగింది. ఓ బాలుడు, మరో బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. పెద్దవారు ఎవరు లేకపోవడాన్ని గమనించిన ఓ బాలుడు వారి ఇంట్లోకి ప్రవేశించాడు. అనంతరం బాలికను బెడ్‌రూమ్‌లోకి లాక్కెళ్లాడు. ఇది గమనించిన చెల్లెలు.. అతనిని అడ్డుకోవడానికి ప్రయత్నించింది. దీంతో అతను చెల్లిని ఒక గదిలో బంధించి.. అక్కపై అత్యాచారం చేసి పరారయ్యాడు.

హైదరాబాద్‌లో దారుణం జరిగింది. ఓ బాలుడు, మరో బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే... చాంద్రాయణగుట్టలో నివసించే ఓ కుటుంబంలోని తల్లి, సోదరులు మంగళవారం రాత్రి ఆసుపత్రికి వెళ్లారు.

ఈ సమయంలో బాధితురాలు ఆమె చెల్లెలు ఇంట్లోనే ఉన్నారు. ఈ సమయంలో పెద్దవారు ఎవరు లేకపోవడాన్ని గమనించిన ఓ బాలుడు వారి ఇంట్లోకి ప్రవేశించాడు. అనంతరం బాలికను బెడ్‌రూమ్‌లోకి లాక్కెళ్లాడు.

ఇది గమనించిన చెల్లెలు.. అతనిని అడ్డుకోవడానికి ప్రయత్నించింది. దీంతో అతను చెల్లిని ఒక గదిలో బంధించి.. అక్కపై అత్యాచారం చేసి పరారయ్యాడు. దారుణం గురించి తెలుసుకున్న బాధితురాలి తల్లి, సోదరులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి... బాలుడిని అరెస్ట్ చేసి జువైనల్ హోంకు తరలించారు. 

PREV
click me!

Recommended Stories

Telangana : మూడో విడత పంచాయతీ పోలింగ్ ప్రారంభం
IMD Rain Alert : బంగాళాఖాతం మారిన వాతావరణం... ఈ ప్రాంతంలో ఇక చలివాన బీభత్సమే..!