పనిమనిషిపై 70 ఏళ్ల వృద్ధుడి కన్ను: 6 నెలలుగా అత్యాచారం, గర్భం దాల్చిన బాలిక

Siva Kodati |  
Published : May 22, 2020, 08:45 PM ISTUpdated : May 22, 2020, 08:46 PM IST
పనిమనిషిపై 70 ఏళ్ల వృద్ధుడి కన్ను: 6 నెలలుగా అత్యాచారం, గర్భం దాల్చిన బాలిక

సారాంశం

మనవరాలి వయసున్న ఓ బాలికపై కామంతో కళ్లు  మూసుకుపోయిన ఓ వృద్ధుడు అత్యాచారానికి పాల్పడి ఆమెను గర్భవతిని చేశాడు

మనవరాలి వయసున్న ఓ బాలికపై కామంతో కళ్లు  మూసుకుపోయిన ఓ వృద్ధుడు అత్యాచారానికి పాల్పడి ఆమెను గర్భవతిని చేశాడు. వివరాల్లోకి వెళితే.. మెదక్ జిల్లా నత్నాయిపల్లి గ్రామానికి చెందిన రుద్రయ్య కుటుంబం జిన్నారం మండలం కిష్టాయిపల్లి గ్రామానికి 12 ఏళ్ల  క్రితం వలస వచ్చింది.

అతనికి కుమారుడు, 14 ఏళ్ల కుమార్తె ఉన్నారు. రుద్రయ్యకు కుటుంబాన్ని పోషించేంత స్తోమత లేకపోవడంతో తన బిడ్డను అదే గ్రామానికి చెందిన 70 ఏళ్ల బషెట్టిగారి దయానంద్ ఇంట్లో పనిమనిషిగా చేర్చాడు.

Also Read:కూతురిపై మూడేళ్లుగా తండ్రి అత్యాచారం: మోసం చేసి మరో వ్యక్తి రేప్

తన ఇంట్లో పనిచేస్తున్న బాలికపై కన్నేసిన దయానంద్ ఎవరూ లేని సమయంలో ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. గ్రామంలో చెబితే ఇంటి పరువు పోతుందని భయపడిన బాలిక.. తనలోనే కుమిలిపోయింది.

ఇదే అదనుగా భావించిన దయానంద్ సుమారు ఆరు నెలల నుంచి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో వారం రోజుల నుంచి ఆ బాలికకు తీవ్రమైన కడుపు నొప్పితో పాటు వాంతలు అవుతుండటంతో ఆసుపత్రికి తరలించారు.

Also Read:అక్క మొగుడితో మైనర్ బాలిక శృంగారం.. గర్భం రావడంతో.

ఆమెను పరీక్షించిన వైద్యులు మూడు నెలల గర్భవతి అని చెప్పడంతో తల్లిదండ్రులు షాక్ అయ్యారు. దీనిపై వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 4 డిగ్రీల టెంపరేచర్..! ఈ 11 జిల్లాల్లో మూడ్రోజులు చలిగాలుల అల్లకల్లోలమే
Government Job : పరీక్ష లేదు, ఇంటర్వ్యూ లేదు.. కేవలం అప్లై చేస్తేచాలు జాబ్ .. తెలుగు యువతకు స్పెషల్ ఛాన్స్