మళ్లీ వాయిదాపడిన నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక, ఇక ఆగస్టులోనే

By Siva KodatiFirst Published May 22, 2020, 7:21 PM IST
Highlights

నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక మరోసారి వాయిదా పడింది. లాక్‌డౌన్ కారణంగా ఎన్నికను 45 రోజుల పాటు వాయిదా వేస్తూ కేంద్ర ఎన్నికల కమీషన్ ఆదేశాలు జారీ చేసింది

నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక మరోసారి వాయిదా పడింది. లాక్‌డౌన్ కారణంగా ఎన్నికను 45 రోజుల పాటు వాయిదా వేస్తూ కేంద్ర ఎన్నికల కమీషన్ ఆదేశాలు జారీ చేసింది.

దీంతో ఆగస్ట్ మొదటి వారంలో నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరిగే అవకాశం వుంది. కరోనా కారణంగా ఇప్పటికే ఒకసారి ఎన్నిక వాయిదా పడింది. నిజామాబాద్ స్థానిక సంస్థల  ఎమ్మెల్సీ ఎన్నికల్లో  టీఆర్ఎస్ అభ్యర్ధిగా మార్చి 18న మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత నామినేషన్ దాఖలు చేశారు.

Also Read:కరోనాతో ఒకే రోజు ఐదుగురు మృతి, 38 కేసులు: తెలంగాణలో కలకలం

గత ఏడాది ఏప్రిల్ మాసంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో  నిజామాబాద్ ఎంపీ స్థానం నుండి కవిత పోటీ  చేసి ఓటమి పాలయ్యారు. దీంతో ఆమె ఈ దఫా ఇదే జిల్లాలోని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. 

కాగా తెలంగాణలో గురువారం నాటికి కరోనా సోకిన వారి సంఖ్య 1,669కి చేరుకుంది. జీహెచ్ఎంసీతో పాటు రంగారెడ్డి జిల్లాలో కోవిడ్ 19 కేసుల సంఖ్య ఎక్కువగా ఉంది. దీనితో పాటు లాక్‌డౌన్4 సడలింపుల కారణంగా కేసులు పెరుగుతున్నట్లుగా నిపుణులు అంచనా వేస్తున్నారు. 

Also Read:షాక్ తింటుందని భార్యకు చెప్పలేదు: కరోనా మృతుడి అంత్యక్రియలపై ఈటల

click me!