ఏలూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లాలో అమానుషమైన సంఘటన చోటు చేసుకుంది. కాపాడాల్సిన కన్నతండ్రే కూతురిని కాటేశాడు. ఓ కామాంధుడు కన్న కూతురిపై మూడేళ్లుగా అత్యాచారానికి పాల్పడుతూ వస్తున్నాడు. 

పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి మండలం విజయరాయికి చెందిన ఓ వ్యక్తి 15 ఏళ్ల కిందట భార్యను, నెల రోజుల పాపను వదిలేసి వెళ్లిపోయాడు. తిరిగి ఐదేళ్ల క్రితం తిరిగి వచ్చాడు. అతని వక్రబుద్ధిని చాటుకున్నాడు. కన్న కూతురిపై కన్నేసి కాటేశాడు. 

మూడేళ్లుగా తండ్రి చేతిలో అత్యాచారానికి గురవుతున్న బాలిక పారిపోయి ఏలూరుకు చేరుకుంది. ఏలూరుకు చెందిన ఓ వ్యక్తి తాను పోలీసునంటూ నమ్మించి బాలికను ఇంటికి తీసుకుని వెళ్లి, ఆమెపై అత్యాచారం చేశాడు. 

సోమవారంనాడు బాలికను తీసుకుని వెళ్లి విజయరాయిలో వదిలిపెట్టాడు. ఆ వ్యక్తి మంగళవారం మరోసారి బాలిక ఇంటికి వచ్చాడు. అయితే, గ్రామస్థులు చితకబాదారు. దాంతో పారిపోయాడు. బాలిక గురువారంనాడు తల్లితో కలిసి ఏలూరు మహిళా పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. 

తండ్రి చేసిన అఘాయిత్యంపైనే కాకుండా ఏలూరులో ఓ వ్యక్తి చేసిన దారుణంపై కూడా పోలీసులకు బాలిక ఫిర్యాదు చేసింది. పోలీసులు దిశ చట్టం ప్రకారం కేసులు నమోదు చేశారు. ఇది తెలిసి బాలిక తండ్రి పురుగులు మందు తాగాడు.