మైనర్ బాలికపై సొంత మేనమామ హత్యాచారం... అదృశ్యమై ముళ్లపొదల్లో శవంగా..

By SumaBala Bukka  |  First Published Apr 18, 2023, 1:59 PM IST

ఓ మైనర్ బాలికను సొంతమేనమామే అత్యాచారం చేసి, దారుణంగా హత్య చేశాడు. బాలిక కనిపించకపోవడంతో మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు హత్యగా తేల్చారు. 


హైదరాబాద్ : హైదరాబాదులోని శంషాబాద్ లో మైనర్ బాలిక హత్య కేసు మిస్టరీ వీడింది. అదృశ్యమైన బాలిక ముళ్ళపొదల్లో శవంగా లభించింది. ఆమె మీద అత్యాచారం చేసి హత్య చేసినట్లుగా తేలింది. సొంత మేనమామే మైనర్ బాలికను అత్యాచారం చేసి ఆపై హత్య చేశారని పోలీసులు తెలిపారు. దీనికి సంబంధించి శంషాబాద్ డిసిపి నారాయణరెడ్డి ఈ మేరకు వివరాలు తెలియజేశారు.. హైదరాబాదులోని మధురానగర్ కాలనీలో వనపర్తి జిల్లా కొత్తకోట  మండలం పాలెం గ్రామానికి చెందిన దంపతులు రెండేళ్లుగా ఉంటున్నారు. వీరు కూలీపనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.

ఈనెల 11వ తేదీన వీరి 16 ఏళ్ల కూతురు కనిపించకుండా పోయింది. అంతటా వెతికిన వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని వెతికారు. అదృశ్యమైన మూడు రోజుల తర్వాత 14వ తేదీన రాళ్లగూడ సర్వీస్ రహదారి పక్కన ఉన్న నిర్మానుష్య ప్రదేశంలోని ఒక ముళ్ళ పొదల్లో మృతదేహం ఉందని వారికి సమాచారం అందింది. పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించిన తర్వాత బాలిక తల్లిదండ్రులను పిలిచి చూపించగా.. 
ఆ మృతదేహం తమ కూతురు దేనిని వారు గుర్తుపట్టారు. 

Latest Videos

హైద్రాబాద్ డీఏవీ స్కూల్‌లో చిన్నారులపై లైంగిక దాడి: డ్రైవర్ కు 20 ఏళ్ల జైలు శిక్ష

దీంతో పోలీసులు ఆ దిశగా దర్యాప్తు ప్రారంభించారు. బాలిక ఇంటి నుంచి వెళ్లిన తర్వాత సీసీటీవీ ఫుటేజ్ లని పోలీసులు పరిశీలించారు. తల్లి సోదరుడు జడ్పోలు విష్ణు (23).. బాలిక అదృశ్యమైన సమయంలో ఆ ప్రాంతంలో కనిపించినట్టుగా స్థానికుల సమాచారం ప్రకారం అతడిని అదుపులోకి తీసుకొని విచారించారు.  దీంతో అసలు విషయం బయటపడింది. విష్ణు  గత ఏడాదికాలంగా మేనకోడలితో సన్నిహితంగా ఉంటూ వస్తున్నాడు. కాగా, గత కొన్ని నెలలుగా ఆమె వేరే వారితో కూడా సన్నిహితంగా ఉంటుంది.  

అది చూసి విష్ణు ఆమె మీద కక్ష పెంచుకున్నాడు. ఆమెను ఎలాగైనా అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. ఈ ప్రకారమే ఏప్రిల్ 11వ తేదీ సాయంత్రం ఆమెను బయటికి రావాలని పిలిచాడు. అలా రాళ్లగూడ సర్వీస్ రహదారి పక్కనున్న నిర్మానుష ప్రాంతంలోకి తీసుకెళ్లాడు. ఆ తర్వాత ఆమె మీద బలవంతంగా అత్యాచారం చేశాడు. ఈ విషయం బయటికి చెబుతుందనుకున్నాడో లేకుంటే మొదట వేసుకున్న ప్లాన్ ప్రకారం హత్య చేయాలనుకున్నాడో…  పక్కనే ఉన్న బండరాయితో తలపై మోదాడు. 

ఆ తర్వాత బాలిక మృతి చెందిందని నిర్ధారించుకున్న తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు.  ఈ మేరకు పోలీసుల విచారణలో అంగీకరించాడు. ఈ కేసును శంషాబాద్ ఏసిపి భాస్కర్ ఆధ్వర్యంలోని సీఐ శ్రీనివాస్, ఎస్ఐలు సుమన్, తరుణ్ లు ఛేదించారు.  డిసిపి వీరికి అభినందనలు తెలిపారు.

click me!