పెళ్లికాకుండానే గర్భం దాల్చిన బాలిక.. ప్రసవం తర్వాత..

Published : Sep 02, 2021, 07:43 AM IST
పెళ్లికాకుండానే గర్భం దాల్చిన బాలిక.. ప్రసవం తర్వాత..

సారాంశం

పెళ్లి కాకుండా నే తల్లి  అయ్యానని బాధ.. భవిష్యత్తులో అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుందనే భయంతో.. బాలిక కుమిలిపోయింది.

గుర్తు తెలియని వ్యక్తి చేతిలో ఓ మైనర్ బాలిక మోసపోయింది. అతను చెప్పిన మాటలు నమ్మి అతనికి శారీరకంగా దగ్గరైంది. ఫలితంగా బాలిక గర్భం దాల్చింది. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెబితే వారు ఏమైపోతారోననే భయంతో.. ఈ విషయం ఎవరికీ చెప్పలేదు. తనలోనే బాధపడింది. అయితే.. కడుపులో బిడ్డను చంపడం ఇష్టం లేక.. తొమ్మిది మాసలు బిడ్డను మోసింది.  ఆ తర్వాత.. బిడ్డను కని. తాను ఆత్మహత్య  చేసుకుంది. ఈ సంఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని ఓ తండాకు చెందిన బాలిక(16) ది వ్యవసాయం కుటుంబం. ఐదో తరగతి వరకూ చదువుకుంది. వ్యవసాయ పనులకు వెళ్లేది. బుధవారం తెల్లవారుజామున తండా శివార్లలో బాలిక మగబిడ్డకు జన్మనిచ్చింది. పెళ్లి కాకుండా నే తల్లి  అయ్యానని బాధ.. భవిష్యత్తులో అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుందనే భయంతో.. బాలిక కుమిలిపోయింది. ఈ క్రమంలోనే.. బాలిక... తనకు పుట్టిన బిడ్డను పొదల్లోకి విసిరేసి.. అనంతరం తాను బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. శిశువును పోలీసులు ఐసీడీఎస్ అధికారులకు అప్పగించారు. బాలికను మోసం చేసిన వ్యక్తి ఎవరో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Hyderabad: న్యూ ఇయర్ వేళ మాదక ద్రవ్యాల మత్తు వదిలించే పాట.. ఆవిష్కరించిన వీసీ సజ్జనార్!
Kalvakuntla Kavitha: సీఎం రేవంత్ రెడ్డిపై రెచ్చిపోయిన కల్వకుంట్ల కవిత | Asianet News Telugu