సినిమా ఎఫెక్ట్... లిప్ట్ లో ఎనిమిదేళ్ల చిన్నారిని మైనర్ బాలుడు ఏం చేశాడంటే

Arun Kumar P   | Asianet News
Published : Sep 23, 2021, 05:22 PM IST
సినిమా ఎఫెక్ట్... లిప్ట్ లో ఎనిమిదేళ్ల చిన్నారిని మైనర్ బాలుడు ఏం చేశాడంటే

సారాంశం

తెలిసీ తెలియని వయసులో సినిమాల ప్రభావంతో ఓ చిన్నారిపట్ల అసభ్యంగా ప్రవర్తించి కటకటాలపాలయ్యాడు 14ఏళ్ల మైనర్ బాలుడు. 

హైదారాబాద్: చిన్నారులపై సినిమాలు ఎంత దుష్ఫ్రభావం చూపుతున్నాయో తెలియజేసే సంఘటన ఒకటి తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో చోటుచేసుకుంది. సినిమాల్లో చూపించే శృతిమించిన రోమాన్స్ ను చూసి దాన్నే హీరోయిజంగా భావించాడు ఓ మైనర్ బాలుడు. దీంతో ఓ చిన్నారితో అలాగే అసభ్యంగా ప్రవర్తించాడు. తెలిసీ తెలియని వయసులో చేసిన తప్పు ఆ బాలున్ని కటకటాలపాలు చేసింది. 

వివరాల్లోకి వెళితే... హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 10లో ఓ అపార్ట్ మెంట్ లో వాచ్ మెన్ గా పనిచేసే వ్యక్తి భార్యా, కొడుకుతో నివాసముంటున్నాడు. అయితే అతడి కొడుకు(14) అదే అపార్ట్ మెంట్ లో వుండే ఎనిమిదేళ్ల బాలికతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఎవరో పిలుస్తున్నాని చెప్పి బాలికను లిప్ట్ లోకి తీసుకెళ్లిన బాలుడు. లిప్ట్ తలుపులు మూతపడగానే ఒక్కసారిగా బాలిక పెదాలపై ముద్దుపెడుతూ, బ్యాడ్ టచ్ తో వేధించాడు. ఇలా లిప్ట్ ఆరో అంతస్తులోకి వెళ్లేవరకు బాలికతో అసభ్యంగా ప్రవర్తించాడు. 

read more  అయ్యా దొర సూడు... నువ్వు చేసిన బారుల, బీరుల తెలంగాణలో మహిళల రక్షణ: కేసీఆర్ పై షర్మిల ఫైర్

అయితే లిప్ట్ ఆగగానే బయటకు వచ్చిన చిన్నారి తన దగ్గరున్న మొబైల్ ఫోన్ తో తల్లికి జరిగిన విషయం తెలిపింది. దీంతో కంగారుపడిపోయిన తల్లి తన  కూతురు వద్దకు చేరుకుని ఇంటికి తీసుకెళ్లింది. అనంతరం బాలిక తల్లిదండ్రులు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు అపార్ట్ మెంట్ వద్దకు చేరకుని బాలున్ని విచారించారు. 

అలా ఎందుకు చేశాడో బాలుడి సమాధానం విని పోలీసులే ఆశ్చర్యపోయారు. చాలా సినిమాల్లో హీరో హీరోయిన్ ను ముద్దుపెట్టకోవడం చూశానని... అది తనకు ఎంతగానో నచ్చిందని తెలిపాడు. అందువల్లే తాను కూడా అలా చేయాలనుకున్నాని బాలికను ముద్దుపెట్టుకున్నట్లు చెప్పడంతో పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులు బాలుడిని ఐపీసీ సెక్షన్‌ 354, పోక్సో యాక్ట్‌ కింద కేసు నమోదు చేసి జువైనల్‌ హోంకు తరలించారు. 
 

PREV
click me!

Recommended Stories

ఏటీఎమ్‌లలో కొత్త ర‌కం దోపిడి.. సైబ‌ర్ క్రైమ్ కోర్స్ నేర్చుకుని క్రిమిన‌ల్‌గా మారిన యువ‌కుడు
పార్టీ పెడతా: Kalvakuntla Kavitha Sensational Statement | Will Launch NewParty | Asianet News Telugu