ఇండియన్ రేసింగ్ లీగ్ లో ప్రమాదం: చెట్టు కొమ్మ విరిగిపడి రేసర్ కు స్వల్ప గాయాలు

By narsimha lodeFirst Published Nov 20, 2022, 2:29 PM IST
Highlights

హుస్సేన్  సాగర్  లోని  ఇండియన్ రేసింగ్  లీగ్ ను  శనివారంనాడు  తెలంగాణ రాష్ట్ర ఐటీ  శాఖ  మంత్రి కేటీఆర్  ప్రారంభించారు. ఇవాళ  ఉదయం నుండి  పోటీలను ప్రారంభించారు. 

హైదరాబాద్:నగరంలోని  హుస్సేన్ సాగర్  లో  జరుగుతున్న  ఇండియన్  రేసింగ్  లీగ్ లో  ఆదివారంనాడు  తృటిలో  ప్రమాదం  తప్పింది.  ఇండియన్  రేసింగ్  లీగ్  లో  భాగంగా  రేసింగ్  లో  పాల్గొంటున్న  కారుపై  చెట్టు కొమ్మ  పడింది. దీంతో  ఆ  కారును  రేసర్  జాగ్రత్తగా  కొద్దిరూరంలో నిలిపాడు. చెట్టు కొమ్మ  పడడంతో  కారు దెబ్బతింది.  ప్రసాద్  ఐ  మ్యాక్స్  కు ఎదుట  ఉన్న  ట్రాక్  మీదుగా రేసర్  తన  కారును  తీసుకెళ్తున్న  సమయంలో  ఈ ఘటన  చోటు  చేసుకుంది.  

శనివారంనాడు  ఇండియా  రేసింగ్  లీగ్  లో  పెను  ప్రమాదం  తప్పింది.  ప్రసాద్ ఐ మ్యాక్స్  ఎదుట  ట్రాక్  మీదుగా  అతి వేగంగా  వస్తున్న  కారుపై  చెట్టు కొమ్మ పడింది.ఎన్టీఆర్  మార్గ్  లో ఉన్న  జరిగిన  ప్రమాదంలో  నూర్  ఆలం  అనే  వ్యక్తి  గాయపడ్డాడు.  మరో  ప్రమాదంలో  రేస్  కారు  టైర్   విడిపోయింది.  అయితే  ఈ  ఘటనలో  కారు  డ్యామేజీ  కాలేద,. దీంతో  డ్రైవర్  సురక్షితంగా  బయటపడ్డాడు.

ఎన్టీఆర్   మార్గ్  లో  ఆదివారంనాడు  మధ్యాహ్నం  జరిగిన రేసింగ్  లో  చెన్నై  టర్బో రైడర్స్  మహిళా  రేసర్ కు స్వల్ప  గాయాలయ్యాయి.క్వాలిఫైయింగ్  రేస్ లో  గోవా  ఏసేస్  రేసింగ్  కారు ఢీకొనడంతో  మహిళా  రేసర్  స్వల్పంగా  గాయపడ్డారు. గాయపడిన  మహిళా  రేసర్ ను ఆసుపత్రికి  తరలించారు.

ఈ రేసింగ్ ను  చూసేందుకు  గ్యాలరీని  ఏర్పాటు  చేశారు.  బుక్  మై  షో  ద్వారా   ఈ  రేసింగ్ ను  చూసేందుకు  టికెట్లను  బుుక్ చేసుకోవచ్చు.ఇవాళ  ఉదయం  ఎనిమిది గంటలకే  ప్రేక్షకులను  రేసింగ్  చూసేందుకు  అనుమతిస్తామని  నిర్వాహకులు  ప్రకటించారు. అయితే   రేసింగ్  ప్రారంభమయ్యే  సమయానికి ప్రేక్షకులు  చాలా  తక్కువ  సంఖ్యలో  హాజరయ్యారు.  మూడు  విడతలుగా  నిర్వహించే  రేసింగ్  లో  వచ్చిన  పాయింట్ల  ఆధారంగా  విజేతను  నిర్ణయిస్తారు. 

ఇండియన్ రేసింగ్  నేపథ్యంలో  హుస్సేన్  సాగర్ పరిసర ప్రాంతాల్లో  పోలీసులు  ట్రాఫిక్  ఆంక్షలను  విధించారు.  ఈ ఎన్టీఆర్  మార్గ్  లో  వాహనాల  రాకపోకలను  అనుమతించడం  లేదు. ఈ  మార్గంలో  వెళ్లాలనుకున్నవారు  ప్రత్యామ్నాయమార్గాల్లో  వెళ్లాలని  అధికారులు  సూచించారు.తొలిసారిగా  హైద్రాబాద్  నగరంలో  రేసింగ్  పోటీలు  జరుగుతున్నాయి. 

click me!