ముందస్తుకు మంత్రులు నో: కేసిఆర్ వెనుకంజ

By pratap reddyFirst Published Aug 23, 2018, 7:10 AM IST
Highlights

ముందస్తు ఎన్నికలు నిర్వహించిన సందర్భాల్లో పాలక పార్టీలకు అనుకూలంగా ఫలితాలు వచ్చిన సంఘటనలు లేవని మంత్రులు కేసీఆర్ తో అన్నట్లు చెబుతున్నారు. బుధవారం నిర్వహించిన మంత్రల అత్యవసర భేటీలో ముందస్తు ఎన్నికలపై విస్తృతంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది.

హైదరాబాద్: ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనే విషయంపై తెలంగాణ ముఖ్యమంత్రి కె.. చంద్రశేఖర రావు వెనకడుగు వేసే అవకాశం ఉంది. ముందస్తు ఎన్నికలపై మంత్రులు వ్యతిరేకత ప్రదర్శించడంతో ఆయన పునరాలోచనలో పడినట్లు చెబుతున్నారు. వాజ్ పేయి, చంద్రబాబు ఉదంతాలను చెప్పి మంత్రులు ముందస్తు ఎన్నికలకు వెళ్లకపోవడమే మంచిదనే అభిప్రాయాన్ని మంత్రులు వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

ముందస్తు ఎన్నికలు నిర్వహించిన సందర్భాల్లో పాలక పార్టీలకు అనుకూలంగా ఫలితాలు వచ్చిన సంఘటనలు లేవని మంత్రులు కేసీఆర్ తో అన్నట్లు చెబుతున్నారు. బుధవారం నిర్వహించిన మంత్రల అత్యవసర భేటీలో ముందస్తు ఎన్నికలపై విస్తృతంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది.

తమ ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఉందని, దాన్ని వాడుకోవడానికి ముందస్తుకు వెళ్తే మంచిదని కేసిఆర్ అభిప్రాయపడ్డారు. ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ పై ఆధారపడి వాజ్ పేయి, చంద్రబాబు 2004లో ఎన్నికలకు వెళ్లారని, అయితే అది పనిచేయలేదని మంత్రులు చెప్పారు. భారత్ వెలిగిపోతోందనే నినాదంపై వాజ్ పేయి, స్వర్ణాంధ్ర ప్రదేశ్ నినాదంపై చంద్రబాబు ముందస్తు ఎన్నికలకు వెళ్లిన విషయాన్ని వారు గుర్తు చేశారు. 

ముందస్తు ఎన్నికలకు వెళ్లడం అనేది అనవసరమైన సమస్యను కొని తెచ్చుకోవడమేనని మంత్రులు అన్నట్లు తెలుస్తోంది. వారి అభిప్రాయంతో ఏకీభవిస్తూ.. తాను ముందస్తు ఎన్నికల గురించి ఎప్పుడూ మాట్లాడలేదని, నిర్ణీత గడువుకన్నా ఆరు నెలలు ముందు ఎన్నికలు జరిగితే అది ముందస్తు కాదని కేసిఆర్ అన్నట్లు సమాచారం. 

ముందస్తు లెక్కలు ఇవీ....

వర్షాలు పడడం వల్ల ప్రాజెక్టులు నిండి ఖరీఫ్ పంటలు బాగా పండే అవకాశం ఉందని, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నీటిని ఇచ్చే కార్యక్రమం దసరా నుంచి ప్రారంభమవుతుందని, రైతు బంధు పథకం కింద ఎకరానికి రూ. 4 వేల చొప్పున రెండో వాయిదా నవంబర్ లో వేస్తున్నామని, అందువల్ల ప్రజల్లో ప్రభుత్వంపై సానుకూల వైఖరి ఉంటుందని, దాన్ని వాడుకుంటే తిరిగి అధికారంలోకి రావచ్చునని కేసిఆర్ వివరించినట్లు తెలుస్తోంది. 

ఏడాదికి 40 వేల కోట్లు ఖర్చు చేస్తూ 45 రకాల సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నందున ప్రజల్లో సానుకూల వైఖరి ఉన్నప్పటికీ ముందస్తు ఎన్నికలకు వెళ్తే విజయం దక్కదనే సెంటిమెంటును గుర్తించాలని మంత్రులు చెప్పినట్లు తెలుస్తోంది. 

click me!