
హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ గురువారం నాడు ప్రగతి భవన్‌లో మంత్రులతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు భవిష్యత్తులో అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ మంత్రులతో చర్చించారు.
సెప్టెంబర్ మాసంలోనే వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధుల జాబితాను ప్రకటిస్తానని కేసీఆర్ ప్రకటించారు. ఈ ప్రకటన మేరకు కేసీఆర్ ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థుల జాబితాకు సంబంధించి మంత్రులతో చర్చించినట్టు సమాచారం. ముందస్తు ఎన్నికలు వస్తే ఏ రకంగా వ్యవహరించాలనే దానిపై కూడ మంత్రులతో సీఎం చర్చించినట్టు తెలుస్తోంది.
మరో వైపు తెలంగాణలో కాంగ్రెస్, టీఆర్ఎస్‌లు పొత్తు పెట్టుకొంటే ఏ రకంగా వ్యవహరించాలి.... ఏ పార్టీకి ప్రయోజనంగా ఉంటుందనే విషయాలపై కూడ చర్చించినట్టు సమాచారం.
2014 ఎన్నికల సమంయలో టీడీపీ, బీజేపీ పొత్తు పెట్టుకొన్నాయి. గ్రేటర్ హైద్రాబాద్ నియోజకవర్గంలో టీడీపీ, బీజేపీలకు ఎక్కువ సీట్లు వచ్చాయి. అయితే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మాత్రం పరిస్థితి మారిపోయింది.
టీడీపీకి ఒక్క కార్పోరేటర్ మాత్రమే దక్కింది. అయితే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో టీడీపీ పొత్తులు పెట్టుకొనే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. ఒకవేళ టీడీపీ కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకొంటే లాభమా, నష్టమా అనే విషయమై కూడ ఈ సమావేశంలో చర్చించినట్టు సమాచారం.
సెప్టెంబర్ రెండో తేదీన నిర్వహించే ప్రగతి సభ నిర్వహణపై కూడ చర్చించినట్టు సమాచారం.ఈ సభకు భారీగా జనాన్ని సమీకరించాలని టీఆర్ఎస్ భావిస్తోంది. అయితే వర్షాలు కురవడం సమయం తక్కువ సమయంలోనే జనాన్ని సమీకరించడంపై మంత్రుల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనట్టు సమాచారం.
కొత్తగా పథకాల అమలు చేయాల్సిన పథకాల గురించి కూడ చర్చించినట్టు సమాచారం.నిజామాబాద్ జిల్లాలో ఎంపీ డీఎస్ వ్యవహరం, భూపతిరెడ్డిపై సస్పెన్షన్ వేటు వేయడం వంటి అంశాలపై కూడ చర్చకు వచ్చినట్టు సమాచారం.