జూలై 2న యశ్వంత్ సిన్హా హైద్రాబాద్ కు రాక: మంత్రులు, ఎమ్మెల్యేలతో కేటీఆర్ భేటీ

By narsimha lodeFirst Published Jun 30, 2022, 12:31 PM IST
Highlights


విపక్ష పార్టీల తరపున రాష్ట్రపతి అభ్యర్ధిగా పోటీ చేస్తున్న యశ్వంత్ సిన్హా జూలై 2న హైద్రాబాద్ కు రానున్నారు.టీఆర్ఎస్ చీఫ్ , సీఎం కేసీఆర్ తో యశ్వంత్ సిన్హా భేటీ కానున్నారు. అదే రోజున కాంగ్రెస్, ఎంఐఎం ప్రజా ప్రతినిధులతో యశ్వంత్ సిన్హా భేటీ కానున్నారు.

హైదరాబాద్: విపక్షాల తరపున రాస్ట్రపతి అభ్యర్ధిగా పోటీ చేస్తున్న Yashwant Sinha, వచ్చే నెల 2వ తేదీన Hyderabad కు రానున్నారు.ఈ నేపథ్యంలో  TRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR  గురువారం నాడు అందుబాటులో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు.

విపక్ష పార్టీల తరపున రాష్ట్రపతి పదవికి యశ్వంత్ సిన్హా ఈ నెల 27న నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా పాల్గొన్నారు. వచ్చే నెల 2వ తేదీన యశ్వంత్ సిన్హా హైద్రాబాద్ కు రానున్న నేపథ్యంలో తనకు మద్దతిచ్చే పార్టీల నేతలు, ఎమ్మెల్యేలతో యశ్వంత్ సిన్హా భేటీ కానున్నారు. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్, Congress ఎంఐఎం నేతలతో యశ్వంత్ సిన్హా భేటీ కానున్నారు.

హైద్రాబాద్ కు యశ్వంత్ సిన్హా రానున్న నేపథ్యంలో  మంత్రులు, ఎమ్మెల్యేలతో కేటీఆర్ భేటీ అయ్యారు. హైద్రాబాద్ కు యశ్వంత్ సిన్హా రానున్న నేపథ్యంలో ఆయనకు భారీగా స్వాగతం పలకాలని కూడా టీఆర్ఎస్ భావిస్తుంది. విపక్షాలు రాష్ట్రపతి పదవికి జరుగుతున్న ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. యశ్వంత్ సిన్హా పర్యటన ఏర్పాట్లను టీఆర్ఎస్ కు చెందిన ఎంపీ రంజిత్ రెడ్డి పర్యవేక్షిస్తున్నారు.

జూలై 2న యశ్వంత్ సిన్హా తెలంగాణ సీఎం KCR తో కూడా సమావేశం కానున్నారు. టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులతో కలిసి యశ్వంత్ సిన్హా హైద్రాబాద్ లో బేటీ కానున్నారు. హైద్రాబాద్ లోని జల విహార్ లో టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులతో యశ్వంత్ సిన్హా భేటీకి అధికార పార్టీ ఏర్పాట్లు చేస్తుంది. అయితే కాంగ్రెస్ పార్టీ కి చెందిన నేతలతో యశ్వంత్ సిన్హా హైద్రాబాద్ లో సమావేశం కానున్నారు. యశ్వంత్ సిన్హాతో సమావేశానికి సంబంధించిన ఏర్పాట్లను కాంగ్రెస్ నేతలు చేయనున్నారు.

యశ్వంత్ సిన్హా హైద్రాబాద్ కు వచ్చే సమయంలోనే హైద్రాబాద్ లో BJP  జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి. జూలై 2, 3 తేదీల్లో రెండు రోజులపాటు National Executive  సమావేశాలు నిర్వహించనున్నారు.  ఈ సమయంలోనే యశ్వంత్ సిన్హా హైద్రాబాద్ కు రావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. మరో వైపు రాష్ట్రపతి పదవికి ఎన్డీఏ తన అభ్యర్ధిగా ద్రౌపది ముర్మును బరిలోకి దింపింది.  నామినేషన్ దాఖలు చేసిన తర్వాత ద్రౌపది ముర్ము విపక్ష పార్టీలకు చెందిన కీలక నేతలకు కూడా ఫోన్ చేసి తనకు మద్దతివ్వాలని కోరింది.

click me!