
మునుగోడును కేటీఆర్ దత్తతకు తీసుకుంటున్నారని చెప్పారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. మంగళవారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ... విపక్షాల డ్రామాలను నమ్మొద్దని ఓటర్లకు పిలుపునిచ్చారు. కాంట్రాక్ట్‌ల కోసమే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారని తలసాని ఎద్దేవా చేశారు. మిషన్ భగీరథతో ఫ్లోరైడ్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించామని.. నల్గొండను ఫ్లోరైడ్ రహిత జిల్లాగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని శ్రీనివాస్ యాదవ్ దుయ్యబట్టారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అభివృద్దిలో దూసుకుపోతోందని తలసాని శ్రీనివాస్ యాదవ్ గుర్తుచేశారు.
ఇకపోతే.. మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ తేదీ సమీపిస్తున్న కొద్ది పార్టీలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే టీఆర్ఎస్ కూడా ప్రచారంలో వేగం పెంచింది. మంత్రులు, టీఆర్ఎస్ ముఖ్య నాయకులు మునుగోడులో ఇంటింటికి ప్రచారం నిర్వహిస్తూ.. పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని ఓటర్లను కోరుతున్నారు. అయితే తాజాగా మంత్రి కేటీఆర్.. మునుగోడులో టీఆర్‌ఎస్‌కు అండగా నిలవాలని యువతను కోరారు. ఈ మేరకు కేటీఆర్ ట్విట్టర్‌లో పోస్టు చేశారు. లక్షలాది యువతకు ఉద్యోగాలు వచ్చేలా కృషిచేస్తున్న టీఆర్ఎస్ సర్కారుకు యువత అండగా ఉండాలని పేర్కొన్నారు.
Also Read:కోమటిరెడ్డి బ్రదర్స్ మోసగాళ్లే:సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని ఫైర్
‘‘ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో, తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య భాగస్వామ్యంలో స్థానిక యువతకు ఉపాధి అందించే సంకల్పంతో ఆసియాలోనే అతి పెద్ద పారిశ్రామికవాడ మునుగోడు నియోజకవర్గంలోని దండు మల్కాపూర్‌లో 2019లోనే నెలకొల్పింది టీఅర్ఎస్ ప్రభుత్వం. సుమారు 35 వేలమంది స్థానిక యువతకు ఉపాధిని అందించే ఈ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కులో ఫుడ్ ప్రాసెసింగ్, టాయ్ పార్కు కూడా వస్తోంది. స్థానిక యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా శరవేగంగా నిర్మాణం అవుతోంది.