డీఏవీ స్కూల్ యాజమాన్యం రేపు హైద్రాబాద్ డీఈఓోతో సమావేశం కానున్నారు.గుర్తింపును రద్దు చేయాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించడంతో రేపు స్కూల్ యాజమాన్యం డీఈఓతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
హైదరాబాద్: డీఏవీ స్కూల్ యాజమాన్యం రేపు హైద్రాబాద్ డీఈఓతో భేటీ కానుంది. డీఏవీ స్కూల్ గుర్తింపును రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ స్కూల్లో చదువుతున్న 700 మంది విద్యార్ధులను ఇతర స్కూల్లో చేర్పించేందుకు చర్యలు తీసుకోవాలని విద్యాశాఖను మంత్రి ఆదేశించారు.
ఇప్పటికిప్పుడే డీఏవీ స్కూల్లో చదువుతున్న విద్యార్ధులను వేరే స్కూల్లో చేర్పించడాన్ని పేరేంట్స్ వ్యతిరేకిస్తున్నారు. రెండు రోజుల క్రితం కేబీఆర్ పార్క్ వద్ద ఈ స్కూల్ లో చదివే విద్యార్ధులు సమావేశమయ్యారు. వేరే స్కూల్లో విద్యార్ధులను చేర్పించే విషయమై పేరేంట్స్ వ్యతిరేకిస్తున్నారు. కొత్త మేనేజ్ మెంట్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పర్యవేక్షణలో స్కూల్ ను నడిపించాలని పేరేంట్స్ కోరుతున్నారు.
డీఏవీ స్కూల్లో చదువుతున్న నాలుగేళ్ల చిన్నారిపై రజనీకుమార్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న విద్యార్ధిని పేరేంట్స్ రజనీకుమార్ పై స్కూల్లోనే దాడి చేశారు. డీఏవీ స్కూల్ ప్రిన్సిపాల్ కారు డ్రైవర్ గా పనిచేస్తున్నారు. నాలుగేళ్ల చిన్నారిపై డిజిటల్ క్లాస్ రూమ్ లో నిందితుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు.ప్రిన్సిపాల్ రూమ్ పక్కనే డిజిటల్ రూమ్ ఉంటుంది. చిన్నారిపై లైంగిక దాడికి రజనీకుమార్ పాల్పడినా కూడ ప్రిన్సిపాల్ పట్టించుకోకపోవడంపై పేరేంట్స్ మండిపడ్డారు. ఈ ఘటనపై న్యాయం చేయాలని కోరుతూ పేరేంట్స్ ఆందోళన నిర్వహించారు. చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడిన రజనీకుమార్ తో పాటు ప్రిన్సిపాల్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. వీరిద్దరిని అరెస్ట్ చేశారు.వీరిద్దరూ ప్రస్తుతం చంచల్ గూడ జైల్లో ఉన్నారు. వీరిద్దరిని కస్టడీలోకి తీసుకోనేందుకు గాను పోలీసులు కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు.
alsoread:కొత్త మేనేజ్ మెంట్ ఆధ్వర్యంలో స్కూల్ నడపాలి:డీఏవీ పేరేంట్స్ డిమాండ్
ఇదిలా ఉంటే స్కూల్ గుర్తింపును రద్దు చేయాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశాలు జారీ చేయడంతో విద్యాశాఖాధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అయితే రేపు డీఏవీ స్కూల్ యాజమాన్యం రేపు హైద్రాబాద్ డీఈఓతో సమావేశం కానున్నారు. గుర్తింపు రద్దు విషయంలో విద్యాశాఖ మాత్రం వెనక్కు తగ్గడం లేదు. ఈ స్కూల్ నుండి వేరే స్కూల్లో విద్యార్ధులను చేర్చడానికి పేరేంట్స్ అంగీకరించడం లేదు . అయితే పేరేంట్స్ డిమాండ్లపై విద్యాశాఖ ఏ రకమైన నిర్ణయం తీసుకొంటారో చూడాలి.