కోమటిరెడ్డి బ్రదర్స్ మోసగాళ్లే:సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని ఫైర్

By narsimha lode  |  First Published Oct 25, 2022, 1:36 PM IST

కోమటిరెడ్డి  బ్రదర్స్ ఇద్దరూ మోసగాళ్లేనని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి  కూనంనేని సాంబశివరావు  చెప్పారు.  కోమటిరెడ్డి రాజగోపాల్  రెడ్డి  ధర్మం వైపున్నారో,అధర్మం వైపున్నారో ప్రజలు  తేల్చనున్నారన్నారు.



హైదరాబాద్:కోమటిరెడ్డి  బ్రదర్స్ ఇద్దరూ మోసగాళ్లేనని సీపీఐ రాష్ట్ర  కార్యదర్శి  కూనంనేని సాంబశివరావు విమర్శించారు.మంగళవారంనాడు ఆయన హైద్రాబాద్ లో మీడియాతో మాట్లాడారు.నల్గొండ  జిల్లాలో మోసకారులు ఎవరంటే కోమటిరెడ్డి  బ్రదర్స్ అని  చెబుతారన్నారు.  గత  ఎన్నికల్లో  కాంగ్రెస్ అభ్యర్ధిగా  బరిలో ఉన్న  కోమటిరెడ్డి రాజగోపాల్  రెడ్డికి  తమ పార్టీ కూడ  మద్దతిచ్చిందన్నారు. అంతేకాదు తనను నమ్ముకున్న  వారిని  కూడ  రాజగోపాల్  రెడ్డి  మోసం  చేశారన్నారు. అలాంటి కోమటిరెడ్డి రాజగోపాల్  రెడ్డి  ధర్మ యుద్ధ:   చేస్తున్నానని చెప్పడం  హాస్యాస్పదంగా ఉందన్నారు. రాజగోపాల్  రెడ్డి  ధర్మపరుడో  అధర్మపరుడో  ఎన్నికల్లో  ప్రజలు  తేల్చనున్నారని ఆయన  చెప్పారు.కోమటిరెడ్డి  బ్రదర్స్ ను  మాయగాళ్లుగా కూనంనేని సాంబశివరావు  చెప్పారు.

కాంగ్రెస్ లో గెలిచి  బీజేపీతో లోపాయికారిగా ఒప్పందాన్ని కోమటిరెడ్ది  రాజగోపాల్  రెడ్డి కొనసాగించారని  ఆయన ఆరోపించారు.  కాంగ్రెస్ పార్టీలో ఉంటూ  తన సోదరుడు  కోమటిరెడ్డి  రాజగోపాల్  రెడ్డికి ఓటేయాలని  ఎంపీ  కోమటిరెడ్డి  వెంకట్  రెడ్డి  కోరడాన్ని ఆయన తప్పుబట్టారు.అన్నదమ్ముల  అనుబంధం రాజకీయాల్లో ఎందుకని  ఆయన  ప్రశ్నించారు. తమ్ముడిపై ప్రేమ ఉంటే  కుటుంబంలో  చూపించాలని  కూనంనేని సాంబశివరావు కోమటిరెడ్డి వెంకట్  రెడ్డికి సూచించారు. కోమటిరెడ్డి  వెంకట్  రెడ్డి  కూడ  కాంగ్రెస్ కు  రాజీనామా  చేసి  తన  సోదరుడికి  మద్దతుగా  ప్రచారం  చేస్తే  నైతికత అని ఆయన పేర్కొన్నారు.

Latest Videos

మునుగోడులో  వచ్చే  నెల 3న ఉప  ఎన్నిక  జరగనుంది. ఈ  ఏడాది ఆగస్టు  8న  కోమటిరెడ్డి రాజగోపాల్  రెడ్డి  ఎమ్మెల్యే  పదవికి  రాజీనామా  చేశారు. దీంతో  ఉప  ఎన్నిక  అనివార్యమైంది.ఈ ఏడాది ఆగస్టు 4న కాంగ్రెస్  పార్టీకి  రాజగోపాల్  రెడ్డి రాజీనామా  చేశారు.  అదే నెల  21న  బీజేపీలో  చేరారు.రాజగోపాల్  రెడ్డి  సోదరుడు వెంకట్  రెడ్డి  కాంగ్రెస్  పార్టీలోనే ఉన్నారు. అయితే  ఈ ఉప  ఎన్నికల్లో ప్రచారానికి కోమటిరెడ్డి  వెంకట్  రెడ్డి దూరంగా  ఉన్నారు.  కానీ  కాంగ్రెస్ కార్యకర్తలకు  పోన్  చేసి  రాజగోపాల్  రెడ్డికి  ఓటేయాలని  కోరినట్టుగా ఆడియో సంభాషణ  వెలుగు  చూసింది. దీనిపై  కాంగ్రెస్  పార్టీ  నాయకత్వం  సీరియస్  అయింది.  కోమటిరెడ్డి  వెంకట్  రెడ్డికి  షోకాజ్ నోటీసులు జారీ  చేసింది.

click me!