మత విద్వేషాలు రెచ్చగొడితే కఠిన చర్యలే : బైరి నరేష్ వివాదంపై మంత్రి తలసాని స్పందన

Siva Kodati |  
Published : Dec 31, 2022, 02:24 PM IST
మత విద్వేషాలు రెచ్చగొడితే కఠిన చర్యలే : బైరి నరేష్ వివాదంపై మంత్రి తలసాని స్పందన

సారాంశం

మత విద్వేషాలు రెచ్చగొడితే తెలంగాణ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు. అయ్యప్పస్వామిపై బైరి నరేష్ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ఇతర మతస్తుల మనోభావాలను కించపరిచేలా మాట్లాడటం సరికాదని తలసాని హితవు పలికారు. 

అయ్యప్పస్వామిపై బైరి నరేష్ చేసిన వ్యాఖ్యలు తెలుగునాట కలకలం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. మత విద్వేషాలు రెచ్చగొడితే తెలంగాణ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని ఆయన హెచ్చరించారు. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా అనుచిత వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇతర మతస్తుల మనోభావాలను కించపరిచేలా మాట్లాడటం సరికాదని తలసాని శ్రీనివాస్ యాదవ్ హితవు పలికారు. 

మరోవైపు బైరి నరేష్‌ను అరెస్ట్ చేసినట్లు వికారాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. వికారాబాద్ రాగానే ఆయనను కోర్టులో హాజరుపరుస్తామని ఆయన వెల్లడించారు. అవసరమైతే పీడీ యాక్ట్ పెడతామని ఎస్పీ పేర్కొన్నారు. మత విద్వేషాలు రెచ్చగొడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.నరేష్ గతంలోనూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని కోటిరెడ్డి తెలిపారు. అయ్యప్పస్వాములు ఆందోళనను విరమించాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు. 

Also REad: అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖ్యలు.. బైరి నరేష్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు..!

కాగా.. బైరి నరేష్‌ను వరంగల్‌లో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా పోలీసులు నరేష్‌ను ట్రేస్ చేశారు. వరంగల్ నుంచి కరీంనగర్ రూట్ వైపు వెళ్తుండగా వరంగల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు నరేష్‌ను అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. నరేష్‌ను ప్రస్తతుం కొడంగల్ తరలిస్తున్నట్టుగా సమాచారం. అయితే నరేష్‌పై కొండగల్‌తో పాటు పలు పోలీసు స్టేషన్‌లలో కేసులు నమోదు అయిన సంగతి తెలిసిందే. ఇక, అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నరేష్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని అయ్యప్ప భక్తులు, హిందూ సంఘాలు, పలువురు రాజకీయ పార్టీల నేతలు డిమాండ్ చేస్తున్నారు. 

బైరి నరేష్ అనే నాస్తికుడు అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నట్టుగా ఉన్న వీడియో వైరల్‌ కావడంతో తెలంగాణలో తీవ్ర కలకలం రేపింది. డిసెంబరు 19న వికారాబాద్ జిల్లా రావులపల్లిలో జరిగిన సభలో అయ్యప్ప స్వామిపై నరేష్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటనపై అయ్యప్ప భక్తులు, హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం బషీర్‌బాగ్‌లోని సిటీ పోలీస్ కమిషనర్ కార్యాలయం వద్ద అయ్యప్ప భక్తులు నిరసనకు దిగారు. మరికొన్ని చోట్ల కూడా అయ్యప్ప భక్తులు నిరసనకు దిగారు. మతపరమైన మనోభావాలను టార్గెట్ చేయడం, అవహేళన చేయడం, దెబ్బతీయడం అనే ఉద్దేశ్యంతో హిందూ దేవుళ్లను టార్గెట్ చేయడం అందరికీ ఫ్యాషన్‌గా మారిందని అన్నారు. అయితే నరేష్‌పై పీడీ యాక్ట్ నమోదు చేయాలని, కఠిన చర్యలు తీసుకోవాలని అయ్యప్ప భక్తులు డిమాండ్ చేస్తున్నారు. బైరి నరేష్ యూట్యూబ్ చానల్‌ను నిషేధించాలని కోరుతున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Rain Alert : ఈ ఐదు జిల్లాలకు పొంచివున్న పిడుగుల గండం... తస్మాత్ జాగ్రత్త
IndiGo Airlines Hyderabad: ఇండిగో విమానాలు ఆలస్యం.. ఎయిర్‌పోర్ట్‌లో గందరగోళం | Asianet News Telugu