ఆ రన్నింగ్ కామెంట్స్ భరించలేకే...డబుల్ బెడ్రూం ఇళ్ల పరిశీలన నిలిపివేత: తలసాని (వీడియో)

By Arun Kumar PFirst Published Sep 20, 2020, 12:33 PM IST
Highlights

డబుల్ బెడ్రూం ఇండ్ల పరిశీలనలో తాను ముందు నడుస్తుంటే కాంగ్రెస్ నాయకులు వెనక నుంచి లేనిపోని కామెంట్లు చేసారని మంత్రి  తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. 

కరీంనగర్: తెలంగాణలో తప్ప భారతదేశంలో ఎక్కడైనా మిషన్ భగీరథ, డబుల్ బెడ్రూం లాంటి పథకాలున్నాయేమో సోకాల్డ్ రాజకీయ నేతలు చూపించాలి అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. డబుల్ బెడ్రూం ఇండ్లు ఎన్ని కట్టామో మీడియాకే వివరాలు ఇస్తామన్నారు. కాంగ్రెస్ నాయకుల సవాల్ ను స్వీకరించి ప్రతిపక్ష కాంగ్రెస్ నాయకులను డబుల్ బెడ్రూం నిర్మాణాల వద్దకు తీసుకెళ్తే లేని పోని ఆరోపణలు చేస్తున్నారన్నారు. 

''ఇండ్ల పరిశీలనలో నేను ముందు నడుస్తుంటే కాంగ్రెస్ నాయకులు వెనక నుంచి లేనిపోని కామెంట్లు చేసారు. ఆ కామెంట్లు భరించలేకే వారిని వెళ్లి పొమ్మని చెప్పా. అందుకే ఇక వాళ్లకు సమాధానం చెప్పనవసరం లేదని అనుకున్నాను. లిస్టు పంపించి మీరే వెళ్లి చూసుకోమని చెప్పా. చాలా లొకేషన్లు ఉన్నాయి. అన్నీ తిరిగితే లక్ష బెడ్ రూంలు ఉన్నాయో లేదో వాళ్లకే తెలుస్తుంది''అని తలసాని పేర్కొన్నారు.

''ఈ పర్యటనలో దారి పొడవునా ఎక్కడా చూసిన పంటపొలాలు పచ్చగా ఉన్నాయి. రిజర్వాయర్లన్నీ నీటితో కళకళలాడుతున్నాయి. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో స్వయం పాలన వస్తే ఏం జరుగుతుందో కేసీఆర్ ఆనాడే చెప్పారు. ఆ కల ఇప్పుడు సాకరమవుతోంది. దేశమే గర్వపడే విధంగా రాష్ట్రం అభివృద్ధి సాధిస్తోంది. కేసీఆర్ సాధించిన విజయాలు చెబితే గొప్ప చరిత్ర అవుతంది. రాస్తే చాలా పుస్తకాలవుతాయి'' అంటూ ముఖ్యమంత్రిని ప్రశంసించారు''పేదల కోసం కేసీఆర్ అనేక పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారు. 

read more   తేనే పూసిన కత్తి: వ్యవసాయ బిల్లుపై కేసీఆర్ కామెంట్స్

''కరోనాతో ప్రపంచం అతలాకుతలమైనప్పటికీ కోటి రెండు లక్షల ఎకరాల్లో పండిన పంటలను కొనుగోలు చేసాం. రెవెన్యూ చట్టం ద్వారా ప్రజలకు మేలు చేసేందుకు సీఎం ఎంతో ధైర్యంతో కొత్త చట్టం తెచ్చారు. తెలంగాణ ఎట్లా ఉండాలనే విషయంలో నిరంతరం కేసీఆర్ తపిస్తుంటారు. అహోరాత్రులు ఆలోచనలు చేసి ఎన్నో పథకాలు తెచ్చారు. దెబ్బతిన్న కులవృత్తులను కాపాడేందుకు ఈ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోంది. గత ప్రభుత్వాల లాగా  గాలి మాటలు చెప్పే ప్రభుత్వం మాది కాదు'' అని అన్నారు. 

వీడియో

"

''రైతు వేదికల నిర్మాణం పూర్తి కావస్తోంది. దసరా రోజున వాటిని ప్రారంభిస్తాం. ప్రజలు అడిగినవే కాకుండా అడగని పథకాలు కూడా అమలు చేస్తున్నాం. కలలో కూడా ఊహించని కాళేశ్వరం ప్రాజెక్టు సాకారమైంది'' అని పేర్కొన్నారు''కరోనా సహా ఏ విషయంలోనూ కేంద్రం పనితీరు సక్కగా లేదు. 

ఒకే దేశం, ఒకే పన్ను అని చెప్పి జీఎస్టీ తెస్తే మనకు ఇష్టం లేకున్నా ఆనాడు అందులో చేరాం. దీంతో మూడేళ్లలలో మనకు 18 వేల కోట్ల నష్టం జరిగింది. జీఎస్టీలో లోటు వస్తే భర్తి చేస్తామని చెప్పిన కేంద్రం ఇప్పుడు అప్పు తీసుకోమంటోంది. విద్యుత్ సంస్థలపై అజమాయిషీ తమ అధీనంలోకి తీసుకోవాలని కేంద్రం కుట్ర చేస్తోంది. ఇదంతా ప్రయివేటు సంస్థలకు దారాధత్తం చేసేందుకు చేస్తున్న ప్రయత్నం. విద్యుత్ విషయంలో లేని ఆంక్షలు పెడితే రైతులకిచ్చే సబ్సిడీ పథకాలకు ఇబ్బందులు వస్తాయి'' అని ఆందోళన వ్యక్తం చేశారు. 

''కేంద్రం 20 లక్షల కోట్ల కరోనా నిధులు ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు గైడ్ లైన్సు కూడా ఇవ్వలేదు. తుగ్లక్ లాగా మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. పార్లమెంట్ లో టీఆర్ఎస్ ఎంపీలతో పాటు దేశంలో కలిసి వచ్చే అందరి ఎంపీలతో కలిసి ప్రభుత్వాన్ని నిలదీస్తాం. కరీంనగర్ ఎంపీగా ఉన్న బండి సంజయ్ ఏడాదిన్నరగా ఏం చేసాడు?హైదరాబాద్ లో కూర్చుని పిచ్చిపిచ్చిగా మాట్లాడటం తప్ప ఈ నియోజకవర్గానికి ఏమైనా చేసాడా? నీకు దమ్ముంటే ప్రధాన మంత్రి దగ్గర కూర్చుని డబ్బులు తెచ్చి చూపించాలి'' అని తలసాని డిమాండ్ చూశారు. 

 

click me!