75 ఏళ్లలో కరోనాను జయించాడు, కానీ చివరికిలా...

By narsimha lodeFirst Published Sep 20, 2020, 11:28 AM IST
Highlights

 కరోనాను జయించినా... కుటుంబసభ్యులు లేరనే మనోవేదనను జయించలేకపోయాడు. ఈ మనోవేదనతోనే 75 ఏళ్ల వృద్ధుడు మరణించాడు. ఈ ఘటన ఉమ్మడి మెదక్ జిల్లాలోని నారాయణఖేడ్ లో చోటు చేసుకొంది.

నారాయణఖేడ్: కరోనాను జయించినా... కుటుంబసభ్యులు లేరనే మనోవేదనను జయించలేకపోయాడు. ఈ మనోవేదనతోనే 75 ఏళ్ల వృద్ధుడు మరణించాడు. ఈ ఘటన ఉమ్మడి మెదక్ జిల్లాలోని నారాయణఖేడ్ లో చోటు చేసుకొంది.

కరోనా వైరస్ సోకినా వారిలో 60 ఏళ్ల  వయస్సు పై బడిన వారు కరోనా నుండి బయటపడడం అంత సులభం కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే  నారాయణఖేడ్ కు చెందిన 75 ఏళ్ల వృద్ధుడికి కరోనా సోకింది.

సంగారెడ్డి జిల్లాలోని నారాయణఖేడ్ మండలం ఆంటోజీ కాలనీకి చెందిన  ఈ వృద్ధుడి కుటుంబంతో పాటు మరో 8 మందికి కరోనా సోకింది. ఈ వృద్ధుడికి ఉమ్మడి కుటుంబం.

దీంతో 8 మందికి ఒకేసారి కరోనా సోకింది. 45 రోజుల క్రితం వీరికి కరోనా సోకింది. అయితే వీరంతా కరోనాకు ఇంటి వద్దనే చికిత్స తీసుకొన్నారు.  గత నెల 12వ తేదీన  ఈ కుటుంబానికి చెందిన తల్లీ కొడుకు కరోనాతో మరణించాడు. 

అయితే కరోనా సోకిన 75 ఏళ్ల వృద్ధుడు కరోనాను జయించారు.  కరోనా నుండి  ఆయన కోలుకొన్నారు. కానీ తన కుటుంబానికి చెందిన ఇద్దరు మరణించడంతో ఆయన మనోవేదనకు గురయ్యాడు. ఇదే విషయమై ఆయన ఎప్పుడూ కుటుంబసభ్యులతో చర్చించి బాధపడేవారు.

తన ఇద్దరు కుటుంబసభ్యులు మరణించిన విషయాన్ని తలుచుకొంటూ శనివారం నాడు తెల్లవారుజామున ఆయన మరణించాడు. గుండెపోటు కారణంగా ఆయన మరణించినట్టుగా కుటుంబసభ్యులు చెప్పారు.
 

click me!