ఎర్రగడ్డ వద్ద నూతనంగా నిర్మించిన ఫుట్ ఓవర్ బ్రిడ్జిని తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, నగర మేయర్ గద్వాల విజయలక్ష్మీ సోమవారం ప్రారంభించారు . ఇందులో మెట్లు, ఎస్కలేటర్, షెల్టర్ వాక్ వే తదితర అత్యాధునిక సదుపాయాలు వున్నాయి.
హైదరాబాద్ నగరంలో మరో ఫుట్ ఓవర్ బ్రిడ్జి ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ఎర్రగడ్డ వద్ద పాదచారులు రోడ్డును దాటేందుకు నిర్మించిన ఫుట్ ఓవర్ బ్రిడ్జిని తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, నగర మేయర్ గద్వాల విజయలక్ష్మీ సోమవారం ప్రారంభించారు. రూ.5 కోట్ల వ్యయంతో దీనిని నిర్మించారు. ఇందులో మెట్లు, ఎస్కలేటర్, షెల్టర్ వాక్ వే తదితర అత్యాధునిక సదుపాయాలు వున్నాయి.
కాగా.. హైదరాబాద్‌లో 38 ఫుట్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం కోసం రూ.100 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా ఇప్పటి వరకు 22 ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు పూర్తవ్వగా.. ఇందులో 7 బ్రిడ్జిలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. మిగిలిన వాటి నిర్మాణం చివరి దశలో వుంది.