ఆర్కే బీచ్‌లో యువకుల గల్లంతు.. మృతుల కుటుంబాలను ఆదుకుంటాం : తలసాని హామీ

Siva Kodati |  
Published : Jan 04, 2022, 02:59 PM IST
ఆర్కే బీచ్‌లో యువకుల గల్లంతు.. మృతుల కుటుంబాలను ఆదుకుంటాం : తలసాని హామీ

సారాంశం

విశాఖపట్నం (visakhapatnam) ఆర్కే బీచ్ లో (rk beach) గల్లంతై మృతి చెందిన యువకుల కుటుంబాలను ఆదుకుంటామన్నారు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్  యాదవ్. విహార యాత్ర కోసం విశాఖపట్నం వెళ్ళి అక్కడి ఆర్కే బీచ్‌లో రసూల్ పురాకు చెందిన శివ, శివ కుమార్, అజీజ్ అనే ముగ్గురు యువకులు మృతిచెందిన సంగతి తెలిసిందే.

విశాఖపట్నం (visakhapatnam) ఆర్కే బీచ్ లో (rk beach) గల్లంతై మృతి చెందిన యువకుల కుటుంబాలను ఆదుకుంటామన్నారు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (talasani srinivas yadav) . విహార యాత్ర కోసం విశాఖపట్నం వెళ్ళి అక్కడి ఆర్కే బీచ్‌లో రసూల్ పురాకు చెందిన శివ, శివ కుమార్, అజీజ్ అనే ముగ్గురు యువకులు మృతిచెందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం మృతుల నివాసాల వద్దకు వెళ్ళి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు మంత్రి తలసాని. ఈ సందర్భంగా ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయలు చొప్పున మూడు కుటుంబాలకు మూడు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించారు. మృతులు నిరుపేద కుటుంబాలకు చెందిన యువకులని .. ముఖ్యమంత్రి కేసీఆర్ (kcr) దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వ సహాయం అందించేలా కృషి చేస్తామని తలసాని శ్రీనివాస్ హామీ ఇచ్చారు. 

Also Read:విశాఖలో విషాదం.. ఆర్కే బీచ్‌లో నలుగురు గల్లంతు, ఒకరి మృతదేహం వెలికితీత

హైదరాబాద్ రసూల్ పురా ప్రాంతానికి చెందిన ఎనిమిది మంది యువకులు న్యూఇయర్ వేడుకల నిమిత్తం విశాఖకు వెళ్లారు. ఈక్రమంలో ఆదివారం ఆర్కే బీచ్ వద్దకు వెళ్లిన ముగ్గురు యువకులు అలల ఉధృతికి సముద్రంలో గల్లంతయ్యారు. ఈఘటనలో సీ.హెచ్ శివ అనే యువకుడు మృతి చెందగా.. గల్లంతైన ఇద్దరు యువకులు కే.శివకుమార్, మహమ్మద్ అజిజ్ ల కోసం సోమవారం ఉదయం నుంచి గాలింపు చేపట్టారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూచన మేరకు.. ఏపీ బీజేపీ నేత, ఎమ్మెల్సీ మాధవ్ ఈ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు

PREV
click me!

Recommended Stories

Sydney Bondi Beach ఉగ్రదాడి: నిందితుడు సాజిద్ అక్రమ్‌కు హైదరాబాద్ లింకులు.. భారత పాస్‌పోర్ట్‌తో షాకింగ్ !
Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?