ప్రతిపక్షాల భాష సరిగా లేదు.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్ధితి: తలసాని వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Sep 22, 2021, 3:18 PM IST
Highlights

విపక్షాలు ఉపయోగిస్తున్న భాష సరిగా లేదని ఆయన అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొందని తలసాని గుర్తుచేశారు.తెలంగాణలోనూ దళిత గిరిజన దండోరా సందర్భంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. టీఆర్ఎస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లపై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. 

ప్రతిపక్షాలపై మండిపడ్డారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. విపక్షాలు ఉపయోగిస్తున్న భాష సరిగా లేదని ఆయన అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొందని తలసాని గుర్తుచేశారు. గతంలో పంటలకు గిట్టుబాటు ధరలు లేక రైతులు ఆత్మహత్యలు చేసుకునేవారని.. ప్రస్తుతం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల అన్నదాతలు సంతోషంగా వున్నారని మంత్రి తెలిపారు. జిల్లాల వారీగా రైతులను చైతన్యపరిచి .. ప్రత్యామ్నాయ పంటలవైపు మొగ్గుచూపేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. 

కాగా, రెండు రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత, టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు నివాసం ఉద్రిక్తత నెలకొన్న సంగతి తెలిసిందే. వైసిపి ప్రభుత్వం, సీఎం జగన్ పై మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా చంద్రబాబు నివాసాన్ని ముట్టడించేందుకు వైసిపి ఎమ్మెల్యే జోగి రమేష్ ప్రయత్నించారు. ఈ విషయం తెలిసి చంద్రబాబు ఇంటివద్దకు టిడిపి శ్రేణులు కూడా భారీగా చేరుకున్నారు. ఈ క్రమంలోనే టిడిపి, వైసిపి శ్రేణుల మధ్య ఘర్షణ చెలరేగింది. ఇక తెలంగాణలోనూ దళిత గిరిజన దండోరా సందర్భంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. టీఆర్ఎస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లపై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. 
 

click me!