రెబెల్ అభ్యర్థులపై విపక్షాల చూపు: ఆటలు సాగవన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్

By Siva KodatiFirst Published Jan 12, 2020, 6:15 PM IST
Highlights

జడ్పీ ఎన్నికల ఫలితాలే మున్సిపల్ లో పునరావృతం అవుతాయన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఆయన ఆదివారం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. విపక్షాలకు అభ్యర్థులు దొరకడం లేదన్నారు. 

జడ్పీ ఎన్నికల ఫలితాలే మున్సిపల్ లో పునరావృతం అవుతాయన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఆయన ఆదివారం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. విపక్షాలకు అభ్యర్థులు దొరకడం లేదన్నారు.

జాతీయ పార్టీ లుగా ఉన్న పార్టీల పరిస్థితి అద్వాన్నంగా ఉందని.. అభ్యర్థులు లేక పరువు నిలుపు కోవడం కోసం బీజేపీ నేతలు అభ్యర్థులను వెతుకుతున్నారని ఆయన సెటైర్లు వేశారు.

Also Read:ట్రాక్టరెక్కి పొలం దున్నిన మంత్రి ఎర్రబెల్లి

సెంటిమెంట్ తో కొంతమంది ఎంపీ ఎన్నికల్లో ఓట్ల వేసినా ఇప్పుడు పశ్చాత్తాప పడుతున్నారని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. తెలంగాణా లో బీజేపీ స్థానం ఎక్కడో ఉప ఎన్నికలు తేల్చాయని.. హుజూర్‌నగర్‌లో 3 వేల ఓట్లు కూడా రాలేని మంత్రి గుర్తుచేశారు.

రాష్ట్రంలో ఇంకా 20యేళ్ళు ఇదే పరిస్థితి ఉంటుందని.. హైకమాండ్‌కు ఏం చెప్పుకోవాలో తెలియక బీజేపీ నేతలు ఎవరో ఒకరికి టికెట్లు ఇస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. రాష్ట్రంలో అనేక సంస్కరణలు తెచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌దేనన్నారు. మున్సిపల్,ఐటీ మంత్రిగా కేటీఆర్ అన్ని జిల్లాలను అభివృద్ధి చేస్తున్నారని శ్రీనివాస్ గౌడ్ గుర్తుచేశారు.

అన్ని పట్టణాల్లో అభివృద్ధికి ప్రణాళికలు ఉన్నాయని.. బీజేపీ గెలిచినా చేసేది ఏం ఉండదని, అక్కడ్కక్కడ గెలిచినా అభివృద్ధికి అడ్డు తగలడమే వారి పనంటూ ఆయన మండిపడ్డారు. రాష్ట్రానికి బీజేపీ నేతలు కొత్తగా ఎలాంటి నిధులు ఇవ్వడం లేదని, రాష్ట్రం నుంచి వందలాది కోట్ల రూపాయలు కేంద్రానికి ఆదాయం వెళుతుందని ఆయన ఎద్దేవా చేశారు.

Also Read:ప్రేయసి హత్య కేసులో కొత్త ట్విస్ట్: ముందు రేప్ చేసి, ఆ తర్వాత...

తమ రెబెల్ అభ్యర్థులకు బి ఫారంలు ఇచ్చేందుకు బీజేపీ, కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నాయని మంత్రి మండిపడ్డారు. 100 కు పైగా మున్సిపాల్టీల్లో టీఆర్ఎస్‌దే విజయమని, మళ్ళీ పనిచేసి చూపుతామని శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు.

రాష్ట్రంలో కొత్త విమానాశ్రయాలు వస్తాయని.. అన్ని కుల వృత్తి లను కాపాడే సంస్కృతి తమదేనన్నారు. ఇప్పటికే ఎంతో చేసామని.. ఇంకా చేయాల్సింది ఉందన్నారు. సెంటిమెంట్ లు ఎక్కడా పనికి రావని.. బీజేపీ నేతలవి పగటి కలలేనని, ప్రజలు ఎన్నటికీ టీఆర్ఎస్ వెంటే ఉంటారని శ్రీనివాస్ గౌడ్ తేల్చి చెప్పారు. 

click me!