వరంగల్: ప్రేయసిని ప్రియుడు గొంతు కోసి హత్య చేసిన ఘటనలో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. తనను కాదని మరొకరిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడిన ప్రియురాలిని ప్రియుడు హత్య చేసిన విషయం తెలిసిందే. శుక్రవారంనాడు ఈ ఘటన జరిగిన విషయం తెలిసిందే. 

alos read:తనను ప్రేమించి మరో వ్యక్తితో పెళ్లి.. వరంగల్ యువతి హత్య కేసులో షాకింగ్ విషయాలు

తనకు మరొకరితో నిశ్చితార్థం జరిగిందని, తనను మరిచిపోవాలని ప్రియురాలు చెప్పింది. అయితే, ఆమెను తన గదికి రావాల్సిందిగా పిలిచాడు. దాంతో సర్దిచెబుదామనే ఉద్దేశంతో ప్రేయసి అతని ఇంటికి వెళ్లింది. పాత జ్ఞాపకాలను గుర్తు చేస్తూ తనను పెళ్లి చేసుకోవాలని బతిమాలాడాడు. ఆమె అందుకు అంగీకరించలేదు. 

దాంతో అతను ఉన్మాదిగా మారి ఆమెపై అత్యాచారం చేశాడు. ఆ తర్వాత కీచైన్ కత్తితో గొంతు కోసి హత్య చేశాడు. తనకు దక్కని అమ్మాయి మరొకరితో దక్కకూడదనే ఉద్దేశంతోనే ఆ దారుణానికి ఒడిగట్టాడు. శనివారంనాడు వరంగల్ కమిషనరేట్ లో నిందితుడు ఎండీ షాహిద్ ను సీపీ రవీందర్ మీడియా ముందు ప్రవేశపెట్టారు. 

వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట విష్ణుపురి కాలనీకి చెందిన షాహిద్ అలియాస్ చోటు తండ్రితో పాటు మటన్ షాపులో పనిచేసేవాడు. 2016లో హన్మకొండలో డిగ్రీ చదువుతున్న సమయంలో అదే కళాశాలలో చదువుతున్న యువతితో పరిచయం ఏర్పడింది. అది కాస్తా స్నేహంగా మారింది. 

యువతిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడిన యువకుడి ఇంటికి కూడా వెళ్లి షాహిద్ బెదిరించాడు. పెళ్లి ఆలోచన మానుకోవాలని హెచ్చరించాడు. దాంతో ఆ యువతి షాహిద్ ను దూరం పెట్టింది. ఈ క్రమంలోనే నమ్మించి షాహిద్ యువతిని హత్య చేశాడు.

హన్మకొండలోని మూడు చింతల దగ్గరికి రావాలని షాహిద్ శుక్రవారం మెసేజ్ పంపించాడు. అక్కడి నుంచి ఆమెను బైక్ పై తీసుకుని వెళ్లాడు. అక్కడ ఆమెపై అత్యాచారం చేసి, కీచైన్ కత్తితో గొంతు కోశాడు. ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత గదికి తాళం వేసి బయటకు వచ్చాడు. తన ఇంటికి వెళ్లి స్నానం చేసి వరంగల్ సెంట్రల్ జైలుకు వెళ్లాడు. అక్కడి నుంచి వెళ్లి సుబేదారి పోలీసు స్టేషన్ లో లొంగిపోయాడు.