నేను కాల్చింది రబ్బర్ బుల్లెట్.. స్పోర్ట్స్‌ మీట్స్‌లో ఇది కామనే : గన్ ఫైరింగ్‌పై శ్రీనివాస్ గౌడ్ క్లారిటీ

Siva Kodati |  
Published : Aug 13, 2022, 04:26 PM IST
నేను కాల్చింది రబ్బర్ బుల్లెట్.. స్పోర్ట్స్‌ మీట్స్‌లో ఇది కామనే : గన్ ఫైరింగ్‌పై శ్రీనివాస్ గౌడ్ క్లారిటీ

సారాంశం

ఫ్రీడమ్ ర్యాలీలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ కాల్పుల వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. దీనిపై మంత్రి స్పష్టతనిచ్చారు. తాను కాల్చింది రబ్బర్ బుల్లెట్ అని స్పోర్ట్స్ మీట్స్‌లో ఇలా కాల్చడం సహజమేనని శ్రీనివాస్ గౌడ్ చెబుతున్నారు

ఫ్రీడమ్ ర్యాలీలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ కాల్పుల వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. దీనిపై మంత్రి స్పష్టతనిచ్చారు. తాను కాల్చింది రబ్బర్ బుల్లెట్ అని.. తాను రైఫిల్ అసోసియేషన్ మెంబర్‌నని శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. తనకు ఎస్పీనే తుపాకీ ఇచ్చారని మంత్రి తెలిపారు. స్పోర్ట్స్ మీట్స్‌లో ఇలా కాల్చడం సహజమేనని శ్రీనివాస్ గౌడ్ చెబుతున్నారు. 

అంతకుముందు పోలీసుల తుపాకీ తీసుకుని గాల్లోకి కాల్పులు జరిపారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. పోలీసులకు చెందిన ఎస్ఎల్ఆర్ వెపన్‌తో గాల్లోకి ఫైర్ చేశారు శ్రీనివాస్ గౌడ్. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మంత్రి కాల్పులు ఎలా జరుపుతారంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి ఫైర్ చేస్తున్నా అధికారులు అడ్డుకోరా అంటూ ప్రశ్నిస్తున్నారు

PREV
click me!

Recommended Stories

Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!
Hyderabad రోడ్లకు ట్రంప్, రతన్ టాటా పేర్లు… రేవంత్ సర్కార్ కొత్త స్ట్రాటజీ ఏంటి?