రాజీనామా చేస్తానని ప్రచారం చేస్తున్నారు.. ఐదేళ్లు నేనే ఎమ్మెల్యే, ఈసారి టికెట్ నాదే : వనమా వెంకటేశ్వరరావు

Siva Kodati |  
Published : Aug 13, 2022, 04:05 PM IST
రాజీనామా చేస్తానని ప్రచారం చేస్తున్నారు.. ఐదేళ్లు నేనే ఎమ్మెల్యే, ఈసారి టికెట్ నాదే : వనమా వెంకటేశ్వరరావు

సారాంశం

తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని కొందరు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కొత్తగూడెం టీఆర్ఎస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు. ఐదేళ్లు నేనే ఎమ్మెల్యేగా వుంటానని.. వచ్చే ఎన్నికల్లోనూ తానే పోటీ చేస్తానని వనమా స్పష్టం చేశారు.   

కొత్తగూడెం (bhadradri kothagudem) టీఆర్ఎస్ (trs) ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు (vanama venkateswara rao) సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై కుట్రలు జరుగుతున్నాయని.. తనపై ఓడినవారు నేను రాజీనామా చేస్తానని ప్రచారం చేస్తున్నారని వనమా ఆరోపించారు. ఐదేళ్లు నేనే ఎమ్మెల్యేగా వుంటానని.. వచ్చే ఎన్నికల్లోనూ తానే పోటీ చేస్తానని వనమా వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. 

ఇకపోతే... వనమా వెంకటేశ్వరరావు కొడుకు రాఘవ (vanama raghava) వేధింపుల కారణంగా ఖ‌మ్మం జిల్లా పాల్వంచలో రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య చేసుకున్న వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆత్మహత్యకు పాల్పడక ముందు రాఘవ వేధింపులకు సంబంధించి రామకృష్ణ రికార్డు చేసిన వీడియోలు తీవ్ర ప్రకంపనలు సృష్టించాయి. తమ కుటుంబం ఎంత మానసనిక వేదనకు గురైందో రామకృష్ణ వీడియోలలో చెప్పారు. దీంతో రాఘవను అరెస్ట్ చేయాలని ప్రతిపక్షాలు, ప్రజల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ వచ్చింది. ఈ క్రమంలోనే పోలీసులు రాఘవను అరెస్ట్ చేశారు.

Also REad:తన కొడుకు రాఘవపై పెట్టిన కేసు నిలవదు.. వారి బండారం బయటపెడతాను: ఎమ్మెల్యే వనమా సంచలన వ్యాఖ్యలు..

ఈ కేసులో వనమా రాఘవకు ఇటీవల హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు.. కొత్తగూడెం నియోజకవర్గం పరిధిలోకి ప్రవేశించరాదని.. ప్రతి శనివారం ఖమ్మం పోలీస్ స్టేషన్‌లో హాజరుకావాలని, సాక్ష్యులను ప్రలోభ పెట్టడం, భయపెట్టడం వంటివి చేయరాదని, సాక్ష్యాలను తారుమారు చేయరాదని ఆదేశించింది.     

అటు తన కొడుకు రాజకీయ భవిష్యతును ఆగం చేశారని వనమా వెంకటేశ్వరరావు వ్యాఖ్యానించడం అప్పట్లో సంచలనం సృష్టించింది. తాను 2 నెలలు అనారోగ్యంతో బాధపడ్డానని తెలిపారు. తాను లేని సమయంలో తన కుమారుడు రాఘవపై కుట్రలు పన్నారని చెప్పుకొచ్చారు. తాను అనారోగ్యం బారిన పడకుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. తన కుమారుడిపై కుట్రలు చేసిన వారి బండారం బయటపెడతానని వనమా వెంకటేశ్వరరావు తెలిపారు. తన పార్టీ వాళ్లతో పాటు ఇతర పార్టీల వాళ్లు కుమ్మకైయ్యారని.. అంతా కలిసే కుట్రలు చేశారని ఆరోపించారు. రాజకీయ కుట్రలు చూసి రాఘవపై ప్రజల్లో సింపతి పెరిగిందని చెప్పుకొచ్చారు. రాఘవపై పెట్టిన కేసు నిలవదని అన్నారు. 

PREV
click me!

Recommended Stories

Hyderabad రోడ్లకు ట్రంప్, రతన్ టాటా పేర్లు… రేవంత్ సర్కార్ కొత్త స్ట్రాటజీ ఏంటి?
IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్