మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు సమ్మె సెగ... అడ్డుకున్న ఆర్టీసీ కార్మికులు

By telugu teamFirst Published Oct 12, 2019, 10:49 AM IST
Highlights

ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు 44శాతం ఫిట్మెంట్ ఇచ్చిందని గుర్తు చేశారు. ఆయన అలా చెప్పగానే తమకు ఫిట్మెంట్ అవసరం లేదని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. దీంతో మంత్రి కాస్త తగ్గి కార్మికుల సమస్యను ప్రజల దృష్టికి తీసుకువెళతానని చెప్పారు.

తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడకు ఆర్టీసీ సమ్మె తగిలింది. ఆయన కాన్వాయిని మహబూబ్ నగర్ ఆర్టీసీ కార్మికులు అడ్డుకున్నారు. మహబూబ్ నగర్ జిల్లా  కేంద్రంలోని అమరుల స్తూపం వద్ద కార్మికులు శుక్రవారం నిరసన ప్రదర్శన చేపట్టారు. అక్కడి నుంచి ర్యాలీగా మంత్రి శ్రీనివాస్ గౌడ నివాసానికి బయలుదేరారు.

అదే సమయంలో మంత్రి కాన్వాయ్ వారికి ఎదురుగా వచ్చింది.  దీంతో కార్మికులు ఆయన వాహనాన్ని అడ్డుకున్నారు. దీంతో శ్రీనివాస్ గౌడ్ వాహనం నుంచి కిందకు దిగారు. ఆర్టీసీ కార్మికుల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపట్ల కార్మికులు మంత్రి ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కార్మికులకు అండగా ఉంటుందని, కొంత మంది సొంత ఎజెండాతో ప్రభుత్వం పై బురద జల్లేందుకు కార్మికులను రెచ్చగొడుతున్నారని మంత్రి ఈ సందర్భంగా ఆరోపించారు.

ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు 44శాతం ఫిట్మెంట్ ఇచ్చిందని గుర్తు చేశారు. ఆయన అలా చెప్పగానే తమకు ఫిట్మెంట్ అవసరం లేదని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. దీంతో మంత్రి కాస్త తగ్గి కార్మికుల సమస్యను ప్రజల దృష్టికి తీసుకువెళతానని చెప్పారు.

ఇదిలా ఉండగా.... ఆర్టీసీ కార్మికుల సమ్మె నేటికి 8వ రోజుకి చేరుకుంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ వారు ఈ సమ్మె కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం జరిపిన చర్చలు విఫలం కావడంతో సమ్మె చేపట్టారు. కాగా... ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులతో బస్సులను నడుపుతోంది. 
 
click me!