ఆర్టీసీ సమ్మె: కుటుంబాలతో సహా రోడ్లపైకి ఆర్టీసీ కార్మికులు

Published : Oct 12, 2019, 10:17 AM ISTUpdated : Oct 12, 2019, 10:39 AM IST
ఆర్టీసీ సమ్మె: కుటుంబాలతో సహా రోడ్లపైకి ఆర్టీసీ కార్మికులు

సారాంశం

తెలంగాణాలో ఆర్టీసీ సమ్మె రోజురోజుకూ ఉదృత రూపం దాలుస్తుంది. నిన్నటికి వారం రోజులు పూర్తయ్యింది. నేడు 8వ రోజుకు చేరుకుంది. ఆర్టీసీ ఉద్యోగులు విధుల్లో చేరనందున ఉద్యోగులు సెల్ఫ్ డిస్మిస్ అయినట్టు ప్రభుత్వం ప్రకటించింది. 

హైదరాబాద్:  తెలంగాణాలో ఆర్టీసీ సమ్మె రోజురోజుకూ ఉదృత రూపం దాలుస్తుంది. నిన్నటికి వారం రోజులు పూర్తయ్యింది. నేడు 8వ రోజుకు చేరుకుంది. ఆర్టీసీ ఉద్యోగులు విధుల్లో చేరనందున ఉద్యోగులు సెల్ఫ్ డిస్మిస్ అయినట్టు ప్రభుత్వం ప్రకటించింది. 

నేడు 8వ రోజు ఆర్టీసీ డిపోల ముందు ఆర్టీసీ కార్మికులు వారి కుటుంబ సభ్యులతోసహా మౌన నిరసన దీక్షలకు దిగనున్నారు. మొన్ననే ఉద్యమ కార్యాచరణను ప్రకటించిన టీఎస్ ఆర్టీసీ జేఏసీ సమ్మె యధాతథంగా కొనసాగుతుందని టీఎస్ఆర్టీసీ జేఏసీ నేత అశ్వత్థామరెడ్డి స్పష్టం చేశారు.

ఈనెల 11న అంటే నిన్న శుక్రవారం రాష్ట్రంలోని అన్ని బస్ డిపోల వద్ద ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు ఇతర ప్రజాప్రతినిధులకు సమస్యలపై వినతిపత్రాలను ఆర్టీసీ కార్మికులు ఇచ్చారు. 

ఈనెల 12న దివంగత నేతల విగ్రహాలకు వినతిపత్రం ఇవ్వనున్నట్లు, అనంతరం రెండు గంటలపాటు మౌన దీక్షకు దిగనున్నట్లు గతంలోనే ఆర్టీసీ జేఏసీ తెలిపింది.

PREV
click me!

Recommended Stories

హైదరాబాద్‌లో సంక్రాంతి ఫుడ్ ఫెస్టివల్ | Sankranthi Food Festival Reaction | Asianet News Telugu
Journalists Arrest : జర్నలిస్టులను ఎందుకు అరెస్ట్ చేశారు.. అసలు ఏమిటీ వివాదం..?