రైతుల పాలిట గొడ్డలిపెట్టు నూతన వ్యవసాయ చట్టాలు : శ్రీనివాస్ గౌడ్

By AN TeluguFirst Published Dec 8, 2020, 10:25 AM IST
Highlights

భారత్ బంద్ నేపథ్యంలో  కేంద్ర నూతన వ్యవసాయ చట్టాలు రైతులకు గొడ్డలిపెట్టు అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. మహబూబ్‌నగర్‌లో నిర్వహించిన బంద్‌లో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్పోరేటు సంస్థలకు మేలు చేసేందుకు కేంద్రం ఆరాటపడుతోందన్నారు. 

భారత్ బంద్ నేపథ్యంలో  కేంద్ర నూతన వ్యవసాయ చట్టాలు రైతులకు గొడ్డలిపెట్టు అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. మహబూబ్‌నగర్‌లో నిర్వహించిన బంద్‌లో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్పోరేటు సంస్థలకు మేలు చేసేందుకు కేంద్రం ఆరాటపడుతోందన్నారు. 

రైతు ప్రయోజనాల కోసం వారితో కలిసి పోరాడుతామన్నారు. కేంద్రం తన నూతన వ్యవసాయ చట్టాలను ఉపసంహరించే వరకూ తమ ఆందోళన ఆగదన్నారు. దేశానికి అన్నం పెట్టే అన్నదాతకు అండగా నిలవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. 

కేంద్రం అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేసే కుట్ర పన్నుతోందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు.

దేశ వ్యాప్తంగా రైతాంగంపై రుద్దినటువంటి వ్యవసాయ నల్ల చట్టాలను వ్యతిరేకిస్తూ ఇచ్చిన రేపటి భారత్ బంద్ పిలుపుకు టిఆర్ఎస్ పార్టీ మద్దతు ఇస్తుందని మంత్రి ఈటల రాజేందర్ గుర్తుచేశారు. కాబట్టి రేపు(మంగళవారం) రైతులు చేపట్టే బంద్ లో టిఆర్ఎస్ శ్రేణులు పాల్గొని ఎక్కడిక్కడ నిర్భంధించాలని మంత్రి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. రైతులకు సంఘీభావం తెలుపుతూ ఈ బంద్ కార్యక్రమంలో తాను కూడా పాల్గొంటానని మంత్రి వెల్లడించారు.

ఇప్పటికే నూతన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ ఈ నెల 8వ తేదీన రైతులు తలపెట్టిన భారత్ బంద్ కు మద్దతుగా తమ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులంతా ఆందోళనలో పాల్గొంటారని తెలంగాణ మంత్రి కేటీఆర్ చెప్పారు. ఆదివారంనాడు కొత్తగా ఎన్నికైన జీహెచ్ఎంసీ కార్పోరేటర్లతో సమావేశం ముగిసిన తర్వాత ఆయన తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. కేంద్రం అప్రజాస్వామికంగా వ్యవసాయ చట్టాల్ని దేశంపై రుద్దిందని తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ చెప్పారు.

నూతన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ రైతులు ఢిల్లీలో ఆందోళన చేస్తున్న రైతులకు తమ పార్టీ సంపూర్ణ మద్దతును ప్రకటించిందన్నారు. రైతు బిడ్డగా ఈ చట్టాలను నిరసిస్తూ రైతులకు ఆందోళన చేపట్టినట్టుగా చెప్పారు. ఎముకలు కొరికే చలిలో ఆందోళన చేస్తున్న రైతులకు సెల్యూట్ చేస్తున్నట్టుగా కేటీఆర్ ప్రకటించారు.రైతులకు సంఘీభావంగా ఈ నెల 8వ తేదీన తలపెట్టిన భారత్ బంద్ కు సంపూర్ణ మద్దతును ప్రకటిస్తున్నట్టుగా కేటీఆర్ తెలిపారు.

click me!