తెలంగాణ కరోనా అప్ డేట్: 96శాతం రికవరీ రేటుతో...రాష్ట్రంలో భారీగా తగ్గుతున్న కేసులు

Arun Kumar P   | Asianet News
Published : Dec 08, 2020, 10:18 AM ISTUpdated : Dec 08, 2020, 10:33 AM IST
తెలంగాణ కరోనా అప్ డేట్: 96శాతం రికవరీ రేటుతో...రాష్ట్రంలో భారీగా తగ్గుతున్న కేసులు

సారాంశం

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు తగ్గుతున్నాయి. తాజాగా రాష్ట్రవ్యాప్తంగా కేవలం 682పాజిటివ్ కేసులు మాత్రమే బయటపడ్డాయి. 

హైదరాబాద్: తెలంగాణలో కరోనా మహమ్మారి ప్రభావం రోజురోజుకు తగ్గుతూ వస్తోంది. తాజాగా గత 24గంటల్లో(ఆదివారం రాత్రి 8గంటల నుండి సోమవారం రాత్రి 8గంటల వరకు) రాష్ట్రవ్యాప్తంగా 55,645మందికి టెస్టులు చేయగా కేవలం 682 పాజిటివ్ కేసులు మాత్రమే బయటపడ్డాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివకు నిర్వహించిన మొత్తం టెస్టుల సంఖ్య 58,68,233 కి చేరగామొత్తం కేసుల సంఖ్య 2,74,540కి చేరాయి.

 ఇక ఇప్పటికే కరోనా బారినపడిన వారిలో తాజాగా 761 మంది కోలుకున్నారు. దీంతో కరోనా నుండి రికవరీ అయినవారి మొత్తం సంఖ్య 2,65,367కి చేరింది. ఇలా కేసుల సంఖ్య తక్కువగా వుండి రికవరీల సంఖ్య ఎక్కువగా వుండటంతో యాక్టివ్ కేసుల సంఖ్య తగ్గింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం కేవలం 7,696యాక్టివ్ కేసులు మాత్రమే వున్నట్లు వైద్యారోగ్యశాఖ ప్రకటించింది.

ఇదిలావుంటే గత 24గంటల్లో రాష్ట్రంలో కరోనాతో కేవలం ముగ్గురు మాత్రమే మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1477కి చేరింది. రాష్ట్రంలో కరోనా మరణాల రేటు 0.53శాతంగా వుంటే దేశంలో ఇది 1.5శాతంగా వుంది. రికవరీ రేటు దేశంలో 94.4శాతంగా వుంటే రాష్ట్రంలో మాత్రం 96.65శాతంగా వుంది. 

జిల్లాలవారిగా కేసుల సంఖ్యను పరిశీలిస్తే అతితక్కువగా కామారెడ్డి 8, జనగామ 2,గద్వాల 1,ఆసిఫాబాద్ 8, మహబూబాబాద్ 8, నారాయణపేట 5, మెదక్ 7, నిర్మల్ 8, సంగారెడ్డి 8, వికారాబాద్ 8, వనపర్తి 7,   కేసులు మాత్రమే నమోదయ్యాయి.  ఇక దరాబాద్(జిహెచ్ఎంసి)లో అత్యధికంగా 119 కేసులు నమోదయ్యాయి. మేడ్చల్ 64, రంగారెడ్డి 47, భద్రాద్రి కొత్తగూడెం 24, కరీంనగర్ 30, ఖమ్మం 38, సూర్యాపేట 23, వరంగల్ అర్బన్ 41,వరంగల్ రూరల్ 10, నల్గొండ 31, మంచిర్యాల 28, జగిత్యాల 22, సిరిసిల్ల 21, నిజామాబాద్ 12, ములుగు 14, సిద్దిపేట 14 కేసులు నమోదయ్యాయి.

పూర్తి వివరాలు:   

 

  

PREV
click me!

Recommended Stories

యశోద ఆసుపత్రికి కేసీఆర్ | KCR To Visit Peddi Sudarshan Reddy | Yashoda Hospital
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీని పరామర్శించిన కేసీఆర్ | KCR Meets Peddi Sudarshan Reddy Family