Singareni Election 2023 : కార్మిక బిడ్డలకు ఉద్యోగాలు... పేరెంట్స్ కు రేషన్, పెన్షన్ :  కాంగ్రెస్ సర్కార్ వరాలు

By Arun Kumar P  |  First Published Dec 25, 2023, 2:48 PM IST

సింగరేణి ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ అనుబంధ కార్మిక సంఘం ఐఎన్టియూసి తరపున తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మికులపై మంత్రి వరాలు కురిపించారు. 


పెద్దపల్లి : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగి నెలరోజులు కూడా కాలేదు మరో ఎన్నికకు సింగరేణి ప్రాంతం సిద్దమయ్యింది. సింగరేణిలో పనిచేసే కార్మికులతో కూడిన గుర్తింపు సంఘాల మధ్య ఎన్నికలు జరగనున్నాయి. హైకోర్టు ఆదేశాలతో ఈ నెల 27న ఎన్నికల నిర్వహణకు సింగరేణి యాజమాన్యం సిద్దమయ్యింది. ఈ క్రమంలో అసెంబ్లీ ఎన్నికల్లో విజయంతో మంచి ఊపుమీదున్న కాంగ్రెస్ సింగరేణి ఎన్నికల్లోనూ జోరుగా ప్రచారం చేపట్టింది. కాంగ్రెస్ అనుబంధ కార్మిక సంఘం ఐఎన్టియూసీ ని గెలిపించుకునేందుకు సింగరేణి ప్రాంతంలోని మంత్రి శ్రీధర్ బాబు రంగంలోకి దిగారు. 

పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం ఆర్జీ3 పరిధిలోని బొగ్గుగనుల వద్ద మంత్రి శ్రీధర్ బాబు ప్రచారం నిర్వభించారు. ఈ సందర్భంగా INTUC (Indian National Trade Union Congress)  సంఘాన్ని గెలిపించాలని మంత్రి కార్మికులను కోరారు. సింగరేణి ప్రైవేటికరణను అడ్డుకోవడంతో పాటు కార్మిక సంక్షేమానికి కృషిచేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ముఖ్యంగా సింగరేణి కార్మికుల సొంతింటి కలను నెరవేరుస్తామని మంత్రి హామీ ఇచ్చారు.  

Latest Videos

undefined

ఇక సింగరేణి కార్మికుల బిడ్డలకు (డిపెండింగ్) పైసా ఖర్చులేకుండా ఉద్యోగాలు ఇస్తామని మంత్రి శ్రీధర్ బాబు హామీ ఇచ్చారు. అలాగే ఉన్నత చదువులు చదివి డిపెండెంట్ ద్వారా ఉద్యోగాలు పొందినవారికి ఇంటర్నల్ పరీక్షలు నిర్వహించి తగిన ఉద్యోగం ఇస్తామన్నారు. ఇలా అర్హత కలిగిన ప్రతి కార్మిక బిడ్డకు ఉన్నతోద్యోగాలు కల్పిస్తామని మంత్రి శ్రీధర్ బాబు హామీ ఇచ్చారు. 

Read More  సింగరేణి కార్మికుల సొంతింటి కల నెరవేరుస్తాం.. స్థలం, రూ.20 లక్షల లోన్ ఇస్తాం - మంత్రి పొంగులేటి..

చాలా సంవత్సరాలు పెండింగ్ లో వున్న కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.  అలాగే సింగరేణి కార్మికుల తల్లిదండ్రులకు పెన్షన్, రేషన్ కార్డు అందేలా చూస్తామని మంత్రి శ్రీధర్ బాబు హామీ ఇచ్చారు. కాబట్టి కార్మికులంతా కాంగ్రెస్ అనుబంధ కార్మికసంఘానికి ఓటేసి గెలిపించాలని మంత్రి  కోరారు. 

సింగరేణిలో మరింత మంది కార్మికులకు ఉపాధి లభించేలా కొత్తగా అండర్ గ్రౌండ్ బొగ్గుగనులను ఏర్పాటుచేయనున్నట్లు మంత్రి హామీ ఇచ్చారు. అలాగే బొగ్గు గనుల్లో మహిళా కార్మికులు ఎలాంటి ఇబ్బంది లేకుండా పని చేసుకునేలా చూస్తామన్నారు. మొత్తంగా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సింగరేణి కార్మికులకు ఎలాంటి సమస్యలు లేకుండా చూస్తామని మంత్రి శ్రీధర్ బాబు హామీ ఇచ్చారు. 
 

click me!