విహారయాత్రలో విషాదం, వికారాబాద్ శివారెడ్డిపేట చెరువులో కారు బోల్తా: ఒకరు గల్లంతు

By narsimha lode  |  First Published Dec 25, 2023, 2:21 PM IST

వికారాబాద్ జిల్లా శివారెడ్డిపేటలో  ప్రమాదం చోటు చేసుకుంది.  ఈ ప్రమాదం నుండి నలుగురు  తప్పించుకున్నారు. ఒకరి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.


హైదరాబాద్: వికారాబాద్ జిల్లా శివారెడ్డిపేట చెరువులోకి కారు బోల్తా పడింది.  ఈ ఘటనలో  కారులోని నలుగురిని సురక్షితంగా బయటకు తీసుకు వచ్చారు.  మరొకరు గల్లంతయ్యారు. గల్లంతైన వ్యక్తిని గుణశేఖర్ గా గుర్తించారు.  గుణశేఖర్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. గుణశేఖర్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. హైద్రాబాద్ నుండి వికారాబాద్ లో  హిల్స్ స్టేషన్ లో  సెలవు రోజుల్లో గడుపుదామని  వెళ్తున్న  కారు ప్రమాదానికి గురైంది.  ఈ ప్రమాదంలో గుణ శేఖర్  గల్లంతయ్యారు. 

 శివారెడ్డిపేట చెరువులోకి దూసుకెళ్లిన కారును  క్రేన్ సహాయంతో బయటకు తీశారు. దట్టంగా పొగమంచు కారణంగా కారు  చెరువులోకి దూసుకెళ్లిందని  బాధితులు చెప్పారు. బాధితులను  వికారాబాద్  ఆసుపత్రిలో చేర్పించారు.

Latest Videos

undefined

వికారాబాద్ జిల్లా అనంతగిరికి విహార యాత్రకు  వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.ఈ కారులో  ఎన్ఆర్ఐ మహిళతో పాటు  సాఫ్ట్ వేర్ ఇంజనీర్లున్నారు. సెలవులు కావడంతో  సెలవు దినాల్లో అనంతగిరిలో  విహారయాత్రకు  వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం  విషాదాన్ని నింపింది.  కారులో  ఒకరు గల్లంతు కావడంతో అతని కోసం  గాలిస్తున్నారు. మిగిలిన నలుగురు ఈ ప్రమాదం నుండి సురక్షితంగా బయట పడ్డారు.

దేశ వ్యాప్తంగా  పలు రాష్ట్రాల్లో  ఈ తరహా ప్రమాదాలు  గతంలో కూడ  చోటు చేసుకున్నాయి. ఈ ఏడాది డిసెంబర్  10వ తేదీన కర్ణాటక రాష్ట్రంలోని చిక్కబళ్లాపూర్ వద్ద  ప్రమాదవశాత్తు  పడింది.ఈ ప్రమాదంలో  నలుగురు  ఇంజనీరింగ్ విద్యార్థులు  మరణించారు.జాతీయ రహదారి  44 పక్కనే ఉన్న చెరువులో కారు పడడంతో  ఈ ప్రమాదం జరిగింది.

ఈ ఏడాది జూలై  17న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆవనిగడ్డ  కరకట్ట పంట కాలువలో  కారు బోల్తా పడింది.ఈ ప్రమాదంలో రత్నభాస్కర్ అనే వ్యక్తి మరణించాడు.  తెలంగాణలోని ఉమ్మడి నల్గొండ జిల్లా పెద్ద అడిశర్లపల్లి మండలం దుగ్యాల వద్ద  ఎలిమినేటి మాధవ రెడ్డి కాలువలో కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు.  ఈ ఘటన  2020 ఫిబ్రవరి  27న జరిగింది.2020 ఫిబ్రవరి  16న ఉమ్మడి కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అలుగునూరు మానేరు వంతెనపై నుండి కారు బోల్తా పడింది.ఈ ఘటనలో  జెండి శ్రీనివాస్ అనే వ్యక్తి మరణించారు. 

 

click me!