Singareni elections 2023 : సింగరేణి కార్మికుల సొంతింటి కలను నెరవేరుస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (minister ponguleti srinivas reddy) హామీ ఇచ్చారు. కారుణ నియామకాలను పారదర్శకంగా చేపడుతామని, అర్హులందరికీ ఉద్యోగాలు దక్కేలా చూస్తామని తెలిపారు.
Singareni elections : సింగరేణి కార్మికుల సొంతింటి కల నెరవేరుస్తామని తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఇంటి స్థలం ఇవ్వడంతో పాటు ఇంటిని నిర్మించుకోవడానికి రూ. 20 లక్షల వడ్డీ లేని లోన్ ఇప్పిస్తామని తెలిపారు. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఇల్లందు, కొత్తగూడెంలో పర్యటించి మాట్లాడారు.
పాతబస్తే అసలైన హైదరాబాద్.. హైకోర్టును అక్కడి నుంచి తరలించొద్దు - అసదుద్దీన్ ఒవైసీ..
సంస్థలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేస్తామని చెప్పారు. కారుణ్య నియామకాలు పారదర్శకంగా చేపడుతామని హామీ ఇచ్చారు. సింగరేణి కార్మికుల వైద్యం కోసం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టిస్తామని తెలిపారు. మహిళా కార్మికులకు గని ఉపరితలంపైనే పని చేసేందుకు అవకాశం ఇస్తామని మంత్రి హామీ ఇచ్చారు. అలాగే సింగరేణి దినోత్సవాన్ని ప్రభుత్వం సెలవుగా ప్రకటిస్తుందని పేర్కొన్నారు. సింగరేణి కార్మికుల డిమాండ్లను, సమస్యలను పరిష్కరిస్తామని పొంగులేటి హామీ ఇచ్చారు.
సింగరేణి కార్మికులకు మీ పొంగులేటి శీనన్న సందేశం pic.twitter.com/ETE8VAPBhG
— Ponguleti Srinivasa Reddy (@mpponguleti)సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల కోసం అంతకు ముందు కూడా ఆయన తన ‘ఎక్స్’ (ట్విట్టర్) హ్యాండిల్ లో ఓ వీడియో పోస్టు చేశారు. మార్పు కోసం, గనుల మనుగడ కోసం, సింగరేణి ఉజ్వల భవిష్యత్తు కోసం ఈ నెల 27వ తేదీన జరిగే సింగరేణి ఎన్నికల్లో ఐఎన్‌టీయూసీకి భారీ మెజారిటీ అందించాలని కోరారు. సింగరేణి కోసం ఐఎన్ టీయూసీ 6 గ్యారెంటీలతో అభయం ఇస్తోందని అన్నారు.
హిందీ మాట్లాడే వారు తమిళనాడులో టాయిలెట్లు కడుగుతారు - డీఎంకే నేత దయానిధి వివాదాస్పద వ్యాఖ్యలు
నూతన అండర్ గ్రౌండ్ బొగ్గు గనులను ప్రారంభిస్తామని, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. సింగరేణి బొగ్గు గనుల ప్రైవేటీకరణను కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అడ్డుకుంటుందని మంత్రి హామీ ఇచ్చారు. సింగరేణి కార్మికులందరికీ సొంత ఇంటి పథకం అమలు చేస్తామని చెప్పారు. ప్రమాదకర పరిస్థితుల్లో పని చేసే సింగరేణి కార్మికులకు చెల్లించే అలవెన్సుపై ఆదాయ పన్ను యాజమాన్యం కట్టేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఇప్పుడున్న అన్ని ఏరియా హాస్పిటల్స్ ను ఆధునీకరించి, కొత్తగా రెండు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. మహిళా కార్మికులకు మౌళిక వసతులు కల్పిస్తామని చెప్పారు.