రోడ్డుపై పడివున్న క్షతగాత్రులను కాపాడి... మానవత్వం చాటుకున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి (VIDEO)

Arun Kumar P   | Asianet News
Published : Dec 03, 2021, 03:45 PM ISTUpdated : Dec 03, 2021, 03:51 PM IST
రోడ్డుపై పడివున్న క్షతగాత్రులను  కాపాడి... మానవత్వం చాటుకున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి (VIDEO)

సారాంశం

రోడ్డు ప్రమాదానికి గురయి తీవ్రంగా గాయపడ్డ క్షతగాత్రులను కాపాడి మానవత్వాన్ని చాటుకున్నారు తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. 

వికారాబాద్: రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపైన యువకులను కాపాడి మానవత్వాన్ని చాటుకున్నారు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. సాటి మనుషుల ప్రాణాలను కాపాడటం కంటే ఏదీ ముఖ్యం కాదని భావించిన ఆమె క్షతగాత్రులను కాపాడేందుకు సమయం కేటాయించారు. హాస్పిటల్ కు తరలించి చేతులు దులుపుకోకుండా మెరుగైన వైద్యం అందించాలని వైద్యసిబ్బందిని కూడా మంత్రి ఆదేశించారు.

వివరాల్లోకి వెళితే...vikarabad లోని డెంటల్ హాస్పిటల్ వద్ద గుర్తుతెలియని వాహనం ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో బైక్ పై వున్న ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఇదే సమయంలో అటుగా వచ్చిన విద్యాశాఖ మంత్రి sabitha indrareddy రోడ్డుపై గాయాలతో పడివున్న క్షతగాత్రులను గమనించారు. దీంతో చలించిపోయిన ఆమె వెంటనే తన కాన్వాయ్ ని ఆపి క్షతగాత్రులను కాపాడారు. 

వీడియో

మొదట గాయపడిన వారికి ధైర్యం చెప్పిన మంత్రి కాన్వాయ్ లోని పోలీస్ వాహనంలో వారిని వికారాబాద్ ఆస్పత్రికి తరలించే ఏర్పాటు చేసారు. వీరికి మెరుగైన చికిత్స అందించాలని హాస్పిటల్ సిబ్బందిని ఆదేశించారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. 

read more  మరోసారి మానవత్వం చాటుకున్న జగన్.. అంబులెన్స్‌కి దారి, వీడియో వైరల్

ఇటీవల తెలంగాణ ఐటీ, పురపాలక మంత్రి కేటీఆర్ కూడా రోడ్డు ప్రమాదానికి గురయిన ఇద్దరు యువకులను కాపాడి మంచిమనసున చాటుకున్నారు. గాయాలతో పడివున్న యువకులను తన కాన్వాయ్ లోని ఓ వాహనంలో ఆస్పత్రికి తరలించారు. బిజీ పనులను పక్కనపెట్టి సాటిమనిషి ప్రాణాలకే ఎక్కువ విలువిచ్చి క్షతగాత్రులను కాపాడిన మంత్రి ktr పై అభినందనలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. 

 మియాపూర్ కు చెందిన పవన్, నగేష్ పనిమీద మియాపూర్ నుండి శామీర్ పేటకు బైక్ పై వెళ్లారు. పని ముగించుకుని రాత్రి మియాపూర్ కు తిరిగి వెళుతుండగా ప్రమాదానికి గురయ్యారు. హకీంపేట వద్ద వీరు ప్రయాణిస్తున్న బైక్ అదుపుతప్పి కిందపడిపోవడంతో ఇద్దరు గాయపడ్డారు.  

ఇదే సమయంలో minister KTR కాన్వాయ్ అటువైపు వచ్చింది. రోడ్డుపై గాయాలతో పడివున్న యువకులను చూసి చలించిపోయిన మంత్రి వెంటనే తన కారును నిలిపారు. గాయపడిన యువకుల పరిస్థితి గురించి తెలుసుకున్న మంత్రి వెంటనే భద్రత సిబ్బంది సాయంతో యువకులిద్దరిని కాపాడారు. ఇద్దరిని తన కాన్వాయ్ లోని ఓ వాహనంలో హాస్పిటల్ కు తరలించి సమయానికి వైద్యం అందేలా చూసారు.

read more మానవత్వాన్ని చాటుకున్న మంత్రి కేటీఆర్... ఇద్దరు యువకులను కాపాడి

ఇక హుజురాబాద్ ఉపఎన్నిక సమయంలో మంత్రి హరీష్ రావు ఇలాగే రోడ్డు ప్రమాదంతో గాయపడిన క్షతగాత్రులను కాపాడారు. హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని తుమ్మనపల్లి వద్ద లారీ‌-బైక్ ఢీకొన్నాయి. అయితే ఈ ప్రమాదంలో లారీ అదుపుతప్పి బోల్తా పడటంలో డ్రైవర్, క్లీనర్ గాయపడగా బైక్ పై వెళ్తున్న ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. Huzurabad bypoll సందర్భంగా జమ్మికుంటలో ఎన్నికల ప్రచారం ముగించుకొని తుమ్మనపల్లి మీదుగా వెళ్తున హరీష్ రావు ఈ ప్రమాదాన్ని చూశాడు. 

వెంటనే హరీష్ తన వాహనాన్ని నిలిపివేసి ప్రమాద బాధితులను ఆసుపత్రికి పంపించిన తర్వాతే మంత్రి అక్కడి నుండి కదిలారు. ప్రమాదం జరిగిన తీరును కూడ స్థానికులను ఆయన అడిగి తెలుసుకొన్నారు. ప్రమాదం జరిగిన తీరును ఓ ప్రత్యక్ష సాక్షి మంత్రికి వివరించారు.

108 అంబులెన్స్ కు మంత్రి హరీష్ రావు పోన్ చేశాడు. అంబులెన్స్ లో ముగ్గురిని ఆసుపత్రికి పంపాడు. గాయపడిన వారికి టీఆర్ఎస్ అభ్యర్ధి గెల్లు శ్రీనివాస్ యాదవ్, మంత్రి హరీష్ రావులు కొంత ఆర్ధిక సహాయం అందించారు.
 


 

PREV
click me!

Recommended Stories

Telangana Panchayat Elections: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్