మంత్రి కోరితేనే స్టేజీ ఎక్కిన క్రీడాకారులు:గుంపుల మధ్య సన్మానంపై అసంతృప్తి

By narsimha lodeFirst Published Jul 7, 2021, 12:09 PM IST
Highlights

ఒలంపిక్స్  పోటీలకు  వెళ్లే క్రీడాకారుల సన్మాన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి  శ్రీనివాస్ గౌడ్  చేదు అనుభవం ఎదురైంది.జన సమూహంలో సన్మానానికి క్రీడాకారులు, కోచ్ లు ముందుకు రాలేదు. దీంతో  సన్మానానికి రావాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ క్రీడాకారులను కోరిన మీదట వారు స్టేజీ ఎక్కారు.


హైదరాబాద్: ఒలంపిక్స్  పోటీలకు  వెళ్లే క్రీడాకారుల సన్మాన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి  శ్రీనివాస్ గౌడ్  చేదు అనుభవం ఎదురైంది.జన సమూహంలో సన్మానానికి క్రీడాకారులు, కోచ్ లు ముందుకు రాలేదు. దీంతో  సన్మానానికి రావాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ క్రీడాకారులను కోరిన మీదట వారు స్టేజీ ఎక్కారు.

జపాన్ లో జరిగే ఒలంపిక్స్ లో పాల్గొనే క్రీడాకారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సన్మాన కార్యక్రమాన్ని బుధవారం నాడు హైద్రాబాద్ లో ఏర్పాటు చేసింది. ఈ సన్మాన కార్యక్రమం సందర్భంగా గుంపులు గుంపులుగా జనం పోగయ్యారు. జన సమూహం మధ్యే సన్మాన కార్యక్రమం నిర్వహించడంపై క్రీడాకారులు, కోచ్‌లు అసంతృప్తిని వ్యక్తం చేశారు. 

జనం గుంపుల మధ్య సన్మానానికి కోచ్‌లు, క్రీడాకారులు ఇష్టపడలేదు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ వినతి మేరకు క్రీడాకారులు పీవీ సింధు, సాయిప్రణీత్  లు  స్టేజీపైకి వెళ్లారు. మంత్రి చేతుల మీదుగా సన్మానం పొందారు. ఈ సన్మాన కార్యక్రమంలో కోవిడ్ ప్రోటోకాల్స్ పాటించకపోవడంపై  క్రీడాకారులు, కోచ్ లు అసంతృప్తిని వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సింధు తో సరదాగా బ్యాడ్మింటన్ ఆడి ప్రోత్సాహించారు.ఈ కార్యక్రమంలో క్రీడా శాఖ కార్యదర్శి  శ్రీనివాస రాజు, స్పోర్ట్స్ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర రెడ్డి, క్రీడా శాఖ డిప్యూటీ డైరెక్టర్ శ్రీమతి సుజాత, నర్సయ్య, వెంకయ్య, ధనలక్ష్మి  తదితరులు పాల్గొన్నారు.


 

click me!