రాహుల్ మారాడనుకున్నా... కానీ పప్పేనని నిరూపించుకున్నాడు..: పువ్వాడ అజయ్ ఎద్దేవా

Published : Jul 03, 2023, 02:31 PM IST
రాహుల్ మారాడనుకున్నా... కానీ పప్పేనని నిరూపించుకున్నాడు..: పువ్వాడ అజయ్ ఎద్దేవా

సారాంశం

కాంగ్రెస్ పార్టీ ఖమ్మంలో నిర్వహించిన జనగర్జన సభలో రాహుల్ గాాంధీ సీఎం కేసీఆర్ పై చేసిన అవినీతి ఆరోపణలపై మంత్రి పువ్వాడ అజయ్ కౌంటరిచ్చారు. 

హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాహుల్ గాంధీ ఖమ్మం సభలో చేసిన వ్యాఖ్యలపై బిఆర్ఎస్ నేతలు భగ్గుమంటున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుటుంబం అవినీతికి పాల్పడుతోందంటూ రాహుల్ చేసిన ఆరోపణలపై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. కాంగ్రెస్ ను మించిన కుటుంబ అవినీతి పార్టీ ఏదైనా ఉందా? అంటూ గాంధీ కుటుంబంపై తీవ్ర ఆరోపణలు చేసారు. 

భారత్ జోడో యాత్రతో రాహుల్ లో పరిపక్వత పెరిగిందని అనుకున్నానని మంత్రి అజయ్ అన్నారు. కానీ ఖమ్మం సభలో ఆయన మాటలు విన్నాక రాహుల్ ఏమీ మారలేదని అర్థమయ్యిందని అన్నారు. సీఎం కేసీఆర్ కుటుంబంపై మరోసారి ప్రేలాపనలు పేలవద్దని పువ్వాడ అజయ్ హెచ్చరించారు. 

రాహుల్ గాంధీకి అసలు లెక్కలు వచ్చా... కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టిందే రూ.80 వేల కోట్లతో... అలాంటిది లక్ష కోట్ల రూపాయల అవినీతి ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అవినీతి జరగలేదని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్లమెంట్ లో అడిగిన ప్రశ్నకు కేంద్రమే బదులిచ్చిందని మంత్రి పువ్వాడ గుర్తుచేసారు. 

కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిన పార్టీ కాదు ద్రోహం చేసిన పార్టీ అని పువ్వాడ అజయ్ ఆరోపించారు. 2009లో తెలంగాణ ప్రకటన చేసి యూ టర్న్ తీసుకుంది కాంగ్రెస్ పార్టీ కాదా? అని నిలదీసారు. ఇప్పుడు అధికారం కోసం కాంగ్రెస్ కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారని... వీరి మాటలు తెలంగాణ ప్రజలు నమ్మబోరని అన్నారు. 

Read More రాసింది చదవడమే రాహుల్ చేస్తున్న పని.. : ఖమ్మం సభలో కామెంట్స్‌పై మంత్రి ప్రశాంత్ రెడ్డి కౌంటర్

కాంగ్రెస్ జాతీయ పార్టీ అని చెప్పుకుంటున్నారు కదా... దమ్ముంటే దేశమంతా రూ.4వేల పెన్షన్ ఇస్తామని ప్రకటించాలని పువ్వాడ అజయ్ డిమాండ్ చేసారు. కాంగ్రెస్ పార్టీలో ఏ టు జడ్ స్కాంలే... అలాంటిది ఆ పార్టీ నాయకులు బిఆర్ఎస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం విడ్డూరంగా వుందని అన్నారు.  

ఆదివారం ఖమ్మంలో నిర్వహించిన కాంగ్రెస్ సభలో దళితనేత భట్టి విక్రమార్కకు రాహుల్ గాంధీ ముందే అవమానం జరిగిందని పువ్వాడ అజయ్ అన్నారు. ఆ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని కష్టపడిన దళిత నేత పరిస్థితే ఇలావుంటే మిగతావారి పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చని అన్నారు. బీఆర్ఎస్ ఆవిర్భావ సభ కు వచ్చిన జనమే రికార్డ్... దాంతో పోలిస్తే నిన్నటి కాంగ్రెస్ సభ లెక్కలోకే రాదని మంత్రి అజయ్ అన్నారు. 

కాంగ్రెస్ పార్టీలో చేరిన ఖమ్మం నేతలంతా అవకాశవాదులేనని పువ్వాడ అజయ్ అన్నారు. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు ఎవరికీ సీఎం కేసీఆర్ కు అన్యాయం చేయలేదని అన్నారు. బిఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించినందుకే పొంగులేటిని సస్పెండ్ చేసామన్నారు. ఈసారి జరిగే ఎన్నికల్లో బీఆర్ఎస్ తొమ్మిది సీట్లు గెలిచి చరిత్ర సృష్టిస్తుందన్నారు. ప్రజలు కేసీఆర్ నే  గతంలో నమ్మారు... ఈసారి కూడా ఆయననే నమ్ముతారని అన్నారు. కాంగ్రెస్ ను  గతంలోనూ నమ్మలేదు ..ఈసారి కూడా నమ్మరని అన్నారు. కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని... దీన్ని ఎవ్వరూ ఆపలేరని మంత్రి పువ్వాడ అజయ్ ధీమా వ్యక్తం చేసారు. 


 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Cold Wave: వ‌చ్చే 4 రోజులు చుక్క‌లే.. గ‌జ‌గ‌జ వ‌ణకాల్సిందే. ఎల్లో అల‌ర్ట్
Vegetables Price : వీకెండ్ మార్కెట్స్ లో ఏ కూరగాయ ధర ఎంత..?