చిరంజీవి పాటలకు డ్యాన్స్ వేశా..మంత్రి పువ్వాడ

Published : Mar 09, 2021, 10:24 AM IST
చిరంజీవి పాటలకు డ్యాన్స్ వేశా..మంత్రి పువ్వాడ

సారాంశం

ఖమ్మం మమతా ఆస్పత్రి మైదానంలో ఆదివారం రాత్రి శ్రీకారం సినిమా ప్రీరిలీజ్ వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చిరంజీవి, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. 

తాను కాలేజీ రోజుల్లో చిరంజీవి పాటలకు డ్యాన్సులు వేశానని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. తాను చిన్నప్పటి నుంచి చిరంజీవికి అభిమానినని.. ఆయన అందరికీ అన్నయ్య లాంటివాడని ఆయన పేర్కొన్నారు.

ఖమ్మం మమతా ఆస్పత్రి మైదానంలో ఆదివారం రాత్రి శ్రీకారం సినిమా ప్రీరిలీజ్ వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చిరంజీవి, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. 

ఈ కార్యక్రమంలో భాగంగా మంత్రి అజయ్ కుమార్ మాట్లాడారు...  కేటీఆర్ హీరో రామ్ చరణ్ కు మంచి మిత్రుడని.. చిరంజీవికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని తనకు ఆదేశించారని.. ఆ మేరకు తన నివాసంలో ఆతిథ్యం ఇస్తున్నట్లు తెలిపారు.

అనంతరం చిరంజీవి మాట్లాడుతూ... 12ఏళ్ల క్రితం ప్రజా అంకిత యాత్రకు ఖమ్మం వచ్చినప్పుడు తనకు అనూహ్య స్పందన లభించిందని... అదే ప్రేమ, అభిమానం చెక్కు చెదరలేదన్నారు. పోరాటాల ఖిల్లా ఖమ్మంకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్లు చెప్పారు.

అనంతరం శర్వానంద్ అభిమానులు చిరంజీవితోపాటు శర్వాను గజమాలతో సత్కరించారు. కొందరు అభిమానులు మైదానంలోని చెట్లు ఎక్కి వేడుకను వీక్షించడం గమనార్హం. 
 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?
Telangana Rising Global Summit: రూ.5.75 లక్షల కోట్ల భారీ ఒప్పందాలు.. ప్రపంచ దిగ్గజ సంస్థల క్యూ !