బ్యుటిషియన్ ఆత్మహత్య: తర్వాత కూడా ఫోన్ లో 123 మిస్డ్ కాల్స్

By telugu teamFirst Published Mar 9, 2021, 9:37 AM IST
Highlights

రంగారెడ్డి జిల్లా మైలారుదేవుపల్లిలో విషాదకరమైన సంఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి వేధింపులు భరించలేక యువతి ఆత్మహత్య చేసుకుంది. మెదక్ జిల్లాలో యాసిడ్ దాడికి గురైన మహిళ మరణించింది.

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా మైలారుదేవుపల్లి విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. ఓ యువతి అష్రాఫ్ అనమే వ్యక్తి వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుంది. గదిలో సోమవారం రాత్రి సీలింగ్ కు ఉరి వేసుకుని ఆమె మరణించింది. వృత్తిరీత్యా ఆమె బ్యుటిషియన్. మెలార్ దేవుపల్లి పోలీస్టు స్టేషన్ పరిధిలోని లక్ష్మీ గుడాలో ఈ సంఘటన చోటు చేసుకుంది. 

గత కొద్ది రోజులుగా అష్రాఫ్ అనే వ్యక్తి తనను వేధిస్తున్నాడని లీజ అనే యువతి కుటుంబ సభ్యులకు తెలిపింది. అష్రాఫ్ ను ఆమె కుటుంబ సభ్యులు పలుమార్లు మందలించారు. అయినా అష్రాఫ్ తన వేధింపులు మానుకోలేదు. దాంతో మనస్తాపానికి గురైన యువతి ఆత్మహత్య చేసుకుంది. 

అమ్మాయి ఆత్మహత్య చేసుకున్న తర్వాత కూడా ఫోన్ లో 123 మిస్డ్ కాల్స్ ఉన్నాయని కుటుంబ సభ్యులు తెలిపారు. అష్రాఫ్ కు రాజకీయ నాయకుల అండదండలున్నాయని వారు ఆరోపిస్తున్నారు. సంఘటనపై లీజ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అష్రాఫ్ పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.

చికిత్స పొందుతూ యాసడ్ బాధితురాలి మృతి

యాసిడ్ దాడికి గురైన మహిళ ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మరణించింది. మెదక్ జిల్లాలోని గడి పెద్దాపూర్ లో చక్రిబాయి అనే 40 ఏళ్ల మహిళపై యాసిడ్ దాడి జరిగింది. ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్చారు. 80 శాతం కాలిన గాయాలతో ఆస్పత్రిలోచేరిన ఆమె మరణించింది. 

బాకీ డబ్బులు అడిగినందుకు సాజిద్ అనే పశువుల వ్యాపారి మహిళపై యాసిడ్ దాడి చేసినట్లు భావిస్తున్నారు. సాజిద్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

భవనంపై నుంచి పడి చిన్నారి మృతి

రాజేంద్ర నగర్ లోని బండ్లగుడా జాగీర్ రాధాపురంలో విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. ఓ చిన్నారి నిర్మాణంలో ఉన్న భవనంపై నుంచి పడి మరణించింది. సరదా ఆడుకుంటూ ప్రమాదవశాత్తు ఆ చిన్నారి భవనంపై నుంచి పడింది.

భార్య, కొడుకులపై కాల్పులు

హైదరాబాదులోని పాతబస్తీ కాలాపత్తర్ లో దిగ్భ్రాంతికరమైన సంఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి భార్యాకొడుకులపై కాల్పులు జరిపాడు. మూడు రౌండ్లు కాల్పులు జరిపాడు. ఈ ఘటన నుంచి అతని భార్యాకొడుకులు తప్పించుకున్నారు.

click me!