ఎన్నికలు ఏవైనా గెలుపు తెరాసదే : మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

By Mahesh Rajamoni  |  First Published Dec 11, 2021, 1:57 PM IST

Puvvada Ajay Kumar : శాసన మండలి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఖమ్మం జిల్లా కేంద్రంలోని RDO కార్యాలయంలో  ఓటు హక్కును వినియోగించున్నారు మంత్రి పువ్వాడ అజ‌య్ కుమార్‌. అనంత‌రం ఆయ‌న టీఆర్ఎస్ జిల్లా కార్యాల‌యంలో మీడియాతో మాట్లాడుతూ.. ఏ ఎన్నిక‌ల్లో అయిన గెలుపు టీఆర్ఎస్‌దే అంటూ వ్యాఖ్య‌లు చేశారు. 


Puvvada Ajay Kumar :  తెలంగాణ‌లో వ‌రుస‌గా వ‌స్తున్న వివిధ ఎన్నిక‌లు రాజ‌కీయ వేడి పుట్టిస్తున్నాయి. ఇటీవ‌లే అసెంబ్లీ ఉప ఎన్నిక‌, ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక‌లు, హుజురాబాద్ ఉప ఎన్నిక జ‌ర‌గ‌డం..  ప్ర‌స్తుతం జ‌రుగుతున్న శాస‌న మండ‌లి స్థానిక ఎన్నిక‌లతో రాజ‌కీయ ర‌గ‌డ మొద‌లైంది.  అన్ని పార్టీలు ఒక‌రిపై ఒక‌రు విమ‌ర్శ‌లు చేసుకుంటున్నాయి. ఇక శ‌నివారం శాసన మండలి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఖమ్మం జిల్లా కేంద్రంలోని RDO కార్యాలయంలో  రాష్ట్ర ర‌వాణా శాఖ మంత్రి పువ్వాడ అజ‌య్ కుమార్ ఓటును వినియోగించుకున్నారు. అనంత‌రం ఆయ‌న  తెరాస ఖమ్మం జిల్లా పార్టీ కార్యాలయంలో ఎంపీ నామా నాగేశ్వరరావు గారితో కలిసి మీడియా స‌మావేశం ఏర్పాటు చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. ఈ ఎన్నిక‌లు వ‌చ్చిన తెలంగాణ రాష్ట్ర స‌మితిదే విజ‌యం అని అన్నారు. ప్ర‌స్తుతం ఖమ్మం జిల్లాలో ఏ ఎన్నికలు నిర్వహించినా గెలుపు తెరాస పార్టీదే న‌నీ, శాసన మండలి స్థానిక సంస్థల కోటా ఎన్నికల్లో విజయం కూడా తెరాస పార్టీదేనని ధీమా వ్యక్తం చేశారు.  టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి తాత మధు భారీ మెజార్టీతో గెలవబోతున్నారని వివరించారు.

Also Read: Covid-19 impact: స్కూళ్ల మూత.. 32 కోట్ల మంది చిన్నారుల‌పై ప్ర‌భావం !

Latest Videos

undefined

అలాగే, కేంద్ర ప్ర‌భుత్వం తీరు కార‌ణంగా రైతులు ఇబ్బందులు ప‌డుతున్నార‌ని అన్నారు. ధాన్యం  పండించిన రైతులకు నిరీక్షణ తప్పడం లేదని మంత్రి పువ్వాడ అజ‌య్ కుమార్ చెప్పారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియను కేంద్రం ఇంకా ప్రారంభించకపోడం పట్ల మంత్రి అసహనం వ్యక్తం చేశారు.  దేశానికి అన్నం పెట్టే రైతన్నలపై కక్షసాధింపు చర్యలు ఎందుకని కేంద్రాన్ని ప్రశ్నించారు.  వరి కోతలు ప్రారంభమై పంట చేతికొస్తున్నా.. కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాకపోవడంతో రైతులను ఆందోళకు గురిచేస్తున్న‌ద‌ని తెలిపారు.  ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో కోతలు ప్రారంభమై ధాన్యం ఇళ్లకు చేరుతున్నాయని అన్నారు.  ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాల్లో వారం రోజుల క్రితం నుంచే రైతులు వరి కోతలు ప్రారంభించారని కానీ కేంద్రానికి మాత్రం ఆయా ధాన్యాన్ని కొనాలన్న ఆలోచన సోయి లేకపోయిందని మండిప‌డ్డారు. 

Also Read: Bank privatisation: కేంద్రం నిర్ణయానికి వ్యతిరేకంగా బ్యాంక్ యూనియన్ల సంచలన నిర్ణయం

రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం తక్షణమే కొనాలని మంత్రి పువ్వాడ డిమాండ్ చేశారు. ఇక భారీ మెజార్టీతో టీఆర్‌ఎస్‌ విజయం ఖాయమన్నారు. స్థానిక సంస్థలకు నిధులు కేటాయించిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.  అలాగే, తమిళనాడులో జరిగిన హెలీకాప్టర్ ప్రమాదంలో ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ గారితో పాటు వారి సతీమణి మరో 11 మంది మరణించడం బాధాకరమంటూ వారికి సంతాపం తెలిపారు.  బిపిన్ రావత్ మరణం దేశానికి తీరని లోటనీ, ప్రమాదంలో మరణించిన వారికి సంతాపం ప్రకటిస్తూ, వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. అనంతరం 2నిమిషాల పాటు మౌనం పాటించారు. కాగా, ఈ స‌మావేశంలో మంత్రి పువ్వాడ‌తో పాటు ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్, డీసీసీబీ ఛైర్మన్ కురాకుల నాగభూషణం,  మేయర్ పునుకొల్లు నీరజ, సూడా చైర్మన్ విజయ్, AMC చైర్మన్ లక్ష్మీ ప్రసన్న, జిల్లా పార్టీ కార్యాలయ ఇంచార్జి RJC కృష్ణ, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు NV తదితరులు పాల్గొన్నారు. 

Also Read: Coronavirus: త‌గ్గిన క‌రోనా కొత్త కేసులు.. పెరిగిన మ‌ర‌ణాలు

click me!