
కరీంనగర్: కరీంనగర్ స్థానికసంస్థల కోటా ఎమ్మెల్సీ (karimnagar mlc election) స్థానాలను టీఆర్ఎస్ పార్టీ (TRS Party) కైవసం చేసుకుంటుందని కరీంనగర్ మేయర్ సునీల్ రావు (karimnagar mayor sunil rao) స్పష్టం చేసారు. ఇండిపెండెంట్ గా బరిలోకి దిగిన రవీందర్ సింగ్ (ravinder singh) గెలిచే అవకాశమే లేదన్నారు. ఒకవేళ అతడు ఎమ్మెల్సీగా గెలిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని సునీల్ రావు సవాల్ చేసారు.
స్థానికసంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల (telangana mlc election) నోటిఫికేషన్ నుండి శుక్రవారం పోలింగ్, ఆ తర్వాత జరిగిన పరిణామాలపై సునీల్ రావు మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి స్వతంత్రంగా ఎమ్మెల్సీ బరిలో నిలిచిన రవీందర్ సింగ్ పై విరుచుకుపడ్డారు. పోలింగ్ ముగిసిన తర్వాత విజయం సాధించినట్లు రవీందర్ సింగ్ సంబరాలు చేసుకోవడం విడ్డూరంగా వుందన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ravinder singh గెలిచే అవకాశమే లేదని సునీల్ రావు స్పష్టం చేసారు.
Video
ఎన్నికల ప్రచార సమయంలోనూ రవీందర్ సింగ్ దిగజారుడు రాజకీయాలు చేసారని ఆరోపించారు. టీఆర్ఎస్ స్థానికసంస్థల ప్రజాప్రతినిధుల లేకపోయినా వారి ఇళ్లకు వెళ్లి కుటుంబసభ్యులు, బంధువుల ద్వారా ప్రలోభాలకు గురిచేయడానికి ప్రయత్నించారని అన్నారు. మొబైల్స్, ఖరీదైన గిప్టులతో పాటు డబ్బులు ఇచ్చి తనకు ఓటేసేలా చూడాలని కోరారు. అయితే తమ ప్రజాప్రతినిధులెవ్వరూ రవీందర్ సింగ్ ప్రలోభాలకు లొంగలేదని మేయర్ స్పష్టం చేసారు.
Video Karimnagar MLC Election 2021: అంబులెన్స్ లో వచ్చి... స్ట్రెచర్ పడుకునే ఓటేసిన ఎంపిటిసి
కరీంనగర్ లో ఓటుహక్కును కలిగిన టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులంతా కుటుంబసభ్యుల్లా ఒకేతాటిపై నిలబడి సత్తా చాటారన్నారు. నీతిమాలిన రాజకీయాలను లొంగిపోకుండా అధిష్టానం నిర్ణయానికే కట్టుబడి వున్నారు. టీఆర్ఎస్ అధ్యక్షులు, సీఎం కేసీఆర్ (KCR) నిర్ణయించిన భానుప్రసాద్ (bhanu prasad), ఎల్ రమణ (l ramana) విజయం ఖాయమని సునీల్ రావు ధీమా వ్యక్తం చేసారు.
రవీందర్ సింగ్ కు మద్దతిస్తున్నామని చెప్పిన పార్టీల నాయకులే ఓటింగ్ లో పాల్గొనలేదని ఎద్దేవా చేసారు. బిజెపి ఎంపీ బండి సంజయ్, కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ఓటేయలేదని గుర్తుచేసారు. ఎలాగూ ఓడిపోతాడని తెలిసే వీరు ఓటు వేయలేదని మేయర్ సునీల్ రావు అన్నారు.
read more MLC Election 2021 : కేసీఆర్, బండి సంజయ్ ఓటు వేయలేదు.. ఎందుకంటే..
ఇక పోలింగ్ సమయంలోనూ టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులతో కలిసి ప్రత్యేక బస్సులో వచ్చిన మంత్రి గంగుల కమలాకర్ (Gangula kamalakar) ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ టీఆర్ఎస్ విజయంపై ధీమా వ్యక్తం చేసారు.
కరీంనగర్ లో టీఆర్ఎస్ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం వుందని... 1324లో దాదాపు వెయ్యి మంది తమ వాళ్ళే వున్నారని మంత్రి పేర్కొన్నారు. బీజేపీ (bjp), కాంగ్రెస్ (congress) పార్టీలు బలం లేదని ఎన్నికల నుండి తప్పుకున్నాయని అన్నారు. ఎవరు మద్దతిచ్చారో తెలీదు గానీ రవీందర్ సింగ్ బరిలో నిలిచాడని అన్నారు.
అయితే టీఆర్ఎస్ కి 986 ఓట్లలో ఒక్కటి తగ్గినా తమ క్రమశిక్షణ తగ్గినట్టేనని మంత్రి గంగుల పేర్కొన్నారు. ఈ ఎన్నిక తర్వాత రాజకీయ పరిణామాలు పూర్తిగా మారుతాయని మంత్రి గంగుల కమలాకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.