తెలంగాణ కో-ఆపరేటివ్‌ బ్యాంక్‌కు కన్నం.. రూ.1.96 కోట్లు మాయం చేసిన కేటుగాళ్లు

By Siva KodatiFirst Published Jul 15, 2021, 5:18 PM IST
Highlights

తెలంగాణ కో-ఆపరేటివ్‌ అపెక్స్‌ బ్యాంక్‌కు సైబర్ కేటుగాళ్లు షాకిచ్చారు. బ్యాంక్ ఖాతాల్లోకి ప్రవేశించి దాదాపుగా రూ.1.96 కోట్లను దోచుకున్నారు.
 

తెలంగాణ కో ఆపరేటివ్ బ్యాంక్‌కు సైబర్ నేరగాళ్లు టోకరా వేశారు. దాదాపు కోటి 90 లక్షల రూపాయలు కొట్టేశారు కేటుగాళ్లు. కో ఆపరేటివ్ బ్యాంక్ ప్రధాన ఖాతా నుంచి నగదు మాయం చేశారు. కొట్టేసిన డబ్బును పది ఖాతాలకు ట్రాన్స్‌ఫర్ చేశారు నిందితులు. మరో కోటి రూపాయలు కొట్టేసేందుకు కూడా విఫలయత్నం చేశారు. డబ్బులు కొట్టేసిన ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సికింద్రాబాద్‌, చందానగర్‌‌లోని మూడు అకౌంట్ల నుంచి ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు సహా వేర్వేరు రాష్ట్రాలలోని బ్యాంకు ఖాతాలకు నగదు బదిలీ అయినట్లు గుర్తించారు. ఈ వివరాలతో అధికారులు సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే ఆ రెండు శాఖలకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది
 

click me!