కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి, ఆయన బంధువుల ఇళ్లలో మంగళవారం నుంచి ఐటీ రైడ్స్ జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆయన కుమారుడు మహేందర్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. ఛాతినొప్పితో హాస్పిటల్ లో చేరారు.
హైదరాబాద్ : తెలంగాణ మంత్రి మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. దాంతో ఆయనను సూరారంలోని ఆస్పత్రికి తరలించారు. ఆదాయం పన్ను (ఐటి) అధికారులు మంగళవారం నుంచి సోదాలు చేస్తున్నారు. దీంతో మహేందర్ రెడ్డి కొంపల్లిలోని ఇంట్లోనే ఉండిపోయారు. ఛాతి నొప్పి రావడంతో మహేందర్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు.
మల్లారెడ్డి ఆస్తులకు సంబంధించి అధికారులు రెండో రోజు కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. ఐటి అధికారులు మల్లారెడ్డి సన్నిహితుడు సంతోష్ రెడ్డి ఇంటికి చేరుకున్నారు. సంతోష్ రెడ్డి ఇంటి తలుపులు తీయలేదు. దీంతో అధికారులు ఇంటి తలుపులు బద్దలు కొట్టారు. పెద్ద యెత్తున సిఆర్పీఎఫ్ బలగాలను మోహరించారు.
undefined
మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డి ఇంట్లోనే కాకుండా అల్లుడు రాజశేఖర్ రెడ్డి ఇంట్లోనూ సోదాలు జరుగుతున్నారు. మల్లారెడ్డి విద్యాసంస్థల ఆర్థిక లావాదేవీలను అధికారులుపరిశీలిస్తున్నారు. మంగళవారం అర్థరాత్రి వరకు ఐటి అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. సోదాలు చేస్తున్న వ్యక్తుల ఇళ్లలోనే మంగళవారం రాత్రి అధికారులు పడుకున్నారు.
మల్లారెడ్డి మరదలు కుమారుడు ప్రవీణ్ రెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు.. యూనివర్సిటీ నిర్వహణ ఆయనదే
సోదాల్లో అధికారులు కీలకమైన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. డబ్బు కూడా స్వాధీనం చేసుకున్నారు. మంగళవారంనాడు అధికారులు నాలుగున్నర కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. మల్లారెడ్డికి సన్నిహితుడైన జైకిషన్ నివాసంలో కూడా ఐటి అధికారులు సోదాలు నిర్వహించారు.
ఇదిలా ఉండగా, మంగళవారం తెల్లవారుజామునుంచి తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి నివాసాలపై ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. కొంపల్లిలోని మల్లా రెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డి ఆయన, అల్లుడు నివాసంలోనూ సోదాలు కొనసాగుతున్నాయి. మొత్తం 50 బృందాలు ఏకకాలంలో ఆయన కార్యాలయాలు, వ్యాపార సముదాయాలు, నివాసాలపై దాడులు నిర్వహిస్తున్నారు. మంగళవారం తెల్లవారుజాము నుంచి ఈ దాడులు కొనసాగుతున్నాయి. మల్లారెడ్డి కాలేజీ లకు మహేందర్ రెడ్డి డైరెక్టర్ గా ఉన్నారు.
హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని మల్లారెడ్డికి సంబంధించిన బంధువుల ఇళ్లల్లో కూడా ఐటీ శాఖ దాడులు నిర్వహిస్తోంది. ఈ రెండు జిల్లాల్లో మొత్తం యాభై చోట్ల ఐటీ శాఖ తనిఖీలు నిర్వహిస్తుంది. మల్లారెడ్డి యూనివర్సిటీ, మల్లారెడ్డి కాలేజీలో సోదాలు కొనసాగుతున్నాయి. ఇంకా మల్లారెడ్డి కూతురు, కొడుకు అల్లుడు నివాసాలతోపాటు మల్లారెడ్డి తమ్ముళ్ల నివాసాల్లో కూడా అధికారులు సోదాలు చేస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారని ఆరాతీస్తున్నారు. ఐటీ రిటర్న్స్ చెల్లింపులకి సంబంధించిన డాక్యుమెంట్లను కూడా పరిశీలిస్తున్నారు.
గత కొద్దిరోజులుగా టీఆర్ఎస్ కు చెందిన మంత్రులు, నేతల ఇళ్లలో కేంద్ర దర్యాప్తు సంస్థలు ఐటీ అధికారులు తనిఖీలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మంత్రి మల్లారెడ్డి ఇంట్లో కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో మల్లారెడ్డి బాగా ప్రచారం చేశారు. టీఆర్ఎస్ గెలుపు కోసం ఎక్కువగా శ్రమించిన నేతల్లో మల్లారెడ్డి కూడా ఒకరిని చెప్పాలి. అక్కడి స్థానికులకు మందు పార్టీలు ఇచ్చారని, ఆయనే స్వయంగా మందు పోస్తున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఈ దాడులకు ముందు రోజే ప్రధానిపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్, బిజెపి ఆటలు సాగవని 2024లో దేశానికి కేసీఆరే ప్రధాని అంటూ మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి కామెంట్స్ చేసిన కొద్ది గంటల్లోనే మంత్రి ఇంటిపై తనిఖీల పేరుతో ఐటి దాడులు చేయడం రాజకీయంగా కలకలం రేపుతోంది