ఐటీ కేసు.. ముగిసిన మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి విచారణ

Siva Kodati |  
Published : Nov 29, 2022, 08:43 PM IST
ఐటీ కేసు.. ముగిసిన మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి విచారణ

సారాంశం

మంత్రి మల్లారెడ్డి ఐటీ కేసులో రెండో రోజు విచారణ ముగిసింది. ఈ  నెల 22, 23 తేదీల్లో  ఐటీ అధికారులు  మంత్రి మల్లారెడ్డి, ఆయన కుటుంబ సభ్యుల నివాసంలో  ఐటీ  అధికారులు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే.

మంత్రి మల్లారెడ్డి ఐటీ కేసులో రెండో రోజు విచారణ ముగిసింది. మల్లారెడ్డి ఆడిటర్‌ను నాలుగు గంటల పాటు ప్రశ్నించారు ఐటీ అధికారులు. మెడికల్ కాలేజ్ , ఇంజనీరింగ్ ఇన్‌స్టిట్యూట్ ప్రిన్సిపాల్, డైరెక్టర్లను విచారించారు అధికారులు. సీట్ల కేటాయింపు నుంచి పేమెంట్ డిటెయిల్స్ వరకు వివరాలు సేకరించారు . పేమెంట్స్ ఎన్ని బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతాయని ఆరా తీశారు ఐటీ అధికారులు. రేపు మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి , మల్లారెడ్డి చిన్న కుమారుడు భద్రా రెడ్డిలు విచారణకు హాజరుకానున్నారు. 

కాగా.. గత వారం నిర్వహించిన సోదాలకు సంబంధించి సోమవారం నాడు  మర్రి రాజశేఖర్ రెడ్డి,  భద్రారెడ్డిని ఐటీ  అధికారులు హైద్రాబాద్ లో విచారించారు.  ఆరు గంటలకు పైగా ఐటీ అధికారులు వీరిని విచారించారు. వీరిద్దరితో పాటు  ఎనిమిది  మందిని  ఐటీ  అధికారులు  ప్రశ్నించారు.పలు  కాలేజీలకు చెందిన  ప్రిన్సిపాల్స్,  అకౌంటెంట్లు, ఇతర సిబ్బంది విచారణకు  హాజరయ్యారు.  మల్లారెడ్డి  కాలేజీలకు  చెందిన  చార్టెడ్  అకౌంటెంట్ ను  రేపు విచారణకు రావాలని ఐటీ  అధికారులు  ఆదేశించారు. ఇవాళ  నిర్వహించిన  విచారణ ఆధారంగా  మరో  10 మందికి నోటీసులు జారీ అయ్యాయి. డిసెంబర్  5వ తేదీ వరకు  ఐటీ అధికారులు  విచారణ నిర్వహించనున్నారు.  ఇవాళ  విచారణకు  హాజరైన  త్రిశూల్ రెడ్డి, లక్ష్మారెడ్డిని  మరో  రోజున విచారణకు  రావాలని ఐటీ అధికారులు తిప్పి  పంపారు.

Also Read: ఆరు గంటలపాటు మంత్రి మల్లారెడ్డి కొడుకు, అల్లుడి విచారణ: మరో 10 మందికి ఐటీ నోటీసులు

ఈ  నెల 22, 23 తేదీల్లో  ఐటీ అధికారులు  మంత్రి మల్లారెడ్డి, ఆయన కుటుంబ సభ్యుల నివాసంలో  ఐటీ  అధికారులు సోదాలు నిర్వహించారు.  ఈ నెల  24వ తేదీతో  ఐటీ అధికారుల సోదాలు ముగిశాయి.  ఈ కేసుకు సంబంధించి విచారణకు  రావాలని  ఐటీ  అధికారులు నోటీసులివ్వడంతో  ఇవాళ  ఎనిమిది  మంది  విచారణకు హాజరయ్యారు. 

ఐటీ అధికారుల  ప్రశ్నలకు సమాధానం చెప్పినట్టుగా మంత్రి మల్లారెడ్డి  అల్లుడు  మర్రి రాజశేఖర్  రెడ్డి  చెప్పారు. ఐటీ  అధికారుల  ప్రశ్నలకు  తాము ఇంకా  సమగ్రంగా  సీఏతో వివరణ ఇవ్వనున్నట్టుగా  చెప్పామన్నారు. అవసరమైనప్పుడు  విచారణకు రావాలని  కోరితే వస్తామని  చెప్పారు. కాలేజీల్లో  పనిచేసే అకౌంటెంట్లు, ప్రిన్సిపాల్స్  వచ్చినట్టుగా ఆయన చెప్పారు. తాము ఇచ్చిన సమాధానాలతో  ఐటీ అధికారులు సంతృప్తి  చెందారనే  అభిప్రాయాన్ని మంత్రి మల్లారెడ్డి  తనయుడు భద్రారెడ్డి  చెప్పారు. ఐటీ అధికారులు ఇచ్చిన ఫార్మెట్  ప్రకారంగా సమాచారం ఇచ్చామన్నారు.

PREV
click me!

Recommended Stories

సంధ్య థియేటర్ కేసు విచారణకు వర్చువల్‌గా హాజరైన అల్లు అర్జున్ | Asianet News Telugu
Pawan Kalyan అంటే భయమా? | Janasena Leader Shankar Goud fire on Jagadeesh Reddy | Asianet News Telugu