వివాహేతర సంబంధాలు హత్యలకు దారితీస్తున్నాయి. తాజాగా ప్రియురాలి మోజులో పడి భార్యను హత్య చేసిన సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది.
వివాహేతర సంబంధాలు పచ్చని సంసారంలో చిచ్చురేపుతున్నాయి. పరాయివారి క్షణిక సుఖం మోజులో పడి కట్టుకున్న వారిని కడతెర్చుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే వికారాబాద్ జిల్లా బంట్వారం మండలం లో చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తన వివాహేతర సంబంధానికి భార్య అడ్డుపడుతున్నాడని అంతమొందించాడు. నేరం బయటపడకుండా ప్రమాదంగా చిత్రీకరించాడు. కానీ కథ అడ్డం తిరిగింది. పోలీసుల దర్యాప్తులో అసలు నిజం వెలుగులోకి వచ్చింది. చివరికి జైలు పాలు కావాల్సివచ్చింది.
ధారూరు సీఐ రామకృష్ణ, బంట్వారం ఎస్‌ఐ ఆనంద్ తెలిపిన వివరాల మేరకు పూర్తి వివరాలిలా ఉన్నాయి. బంట్వారం మండలం వెంకటాపూర్‌లో ప్రకాశ్ తన భార్య జగమ్మ పిల్లలతో కలిసి నివాసముంటున్నాడు. ఈ క్రమంలో ఆయనకు అదే ప్రాంతంలో ఉండే ఓ వివాహితతో పరిచయం మేర్పడింది. ఆ పరిచయం వివాహేతర సంబంధంగా మారింది. ఈ విషయం భార్య జగ్గమ్మ తెలిసింది. దీంతో ఆమెకు ప్రకాశ్ పై అనుమానం పెరిగింది. ప్రతి విషయంలో అనుమానాలు ఆంక్షాలు పెట్టేదేది. దీంతో ఎలాగైనా ఆమె అడ్డు తొలగించుకోవాలనే పాన్ వేశాడు ప్రకాశ్.
ఈ క్రమంలో గత నెల 25న పథకం ప్రకారం.. రాత్రి వేళ.. తన భార్య జగ్గమ్మతో కలిసి బైక్‌పై బయటకు తీసుకెళ్లాడు. ఈ క్రమంలో ఓ గుంతలో పడేశారు. పక్కనే ఉన్న బండరాయితో ఆమె తలపై బలంగా కొట్టి హతమొందించారు. అనంతరం ప్రమాదంగా చిత్రీకరించాడు. తాము బైక్ మీద నుంచి పడిపోయినట్టు తన కుటుంబీకులు, స్నేహితులకు సమాచారం అందించారు. అనంతరం పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాడు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. ఈ నేర విచారణంలో వారికి పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతో ఆ వ్యక్తిని తమదైన శైలిలో విచారించగా .. చేసిన దారుణాన్ని ఒప్పుకున్నారు. నేరం అంగీకరించడంతో ఆ నిందితుడ్ని కోర్టులో హాజరుపర్చి రిమాండ్‌కు తరలించామని పోలీసులు తెలిపారు.