డిసెంబర్ 16న తెలంగాణకు జేపీ నడ్డా.. బండి సంజయ్ పాదయాత్ర ముగింపు సభకు హాజరు..!

Published : Dec 05, 2022, 12:38 PM IST
డిసెంబర్ 16న తెలంగాణకు జేపీ నడ్డా.. బండి సంజయ్ పాదయాత్ర ముగింపు సభకు హాజరు..!

సారాంశం

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా డిసెంబర్ 16వ తేదీన తెలంగాణ పర్యటనకు రానున్నారు. కరీంనగర్ జిల్లాలో బండి సంజయ్ ఐదో విడత ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సభలో జేపీ నడ్డా పాల్గొననున్నారు.

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా డిసెంబర్ 16వ తేదీన తెలంగాణ పర్యటనకు రానున్నారు. కరీంనగర్ జిల్లాలో బండి సంజయ్ ఐదో విడత ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సభలో జేపీ నడ్డా పాల్గొననున్నారు. ఈ మేరకు బీజేపీ నాయకత్వం రాష్ట్ర నాయకులకు సమాచారం అందించినట్టుగా తెలుస్తోంది. జేపీ నడ్డా పాదయాత్ర ముగింపు సభకు హాజరుకానున్న నేపథ్యంలో.. బండి సంజయ్ పాదయాత్ర షెడ్యూల్‌ను అందుకు తగ్గట్టుగా కొద్దిపాటి మార్పులు చేసే అవకాశం కనిపిస్తోంది. 

ఇక, గతకొంతకాలంగా తెలంగాణపై బీజేపీ అధిష్టానం ప్రత్యేక దృష్టి సారించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బీజేపీ అగ్రనాయకులు వరుసగా తెలంగాణలో పర్యటిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో అధికారమే సాధించడమే లక్ష్యంగా పార్టీ క్యాడర్‌కు దిశానిర్దేశం చేస్తూనే ఉన్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

నాకు జవాబు చెప్పాల్సిన అవసరం లేదు.. షాక్‌కి గురి చేస్తున్న ఏఐ మోడ‌ల్ తీరు
మ‌రో 5 ఏళ్ల‌లో ఈ ప‌ట్ట‌ణం హైద‌రాబాద్‌లో క‌ల‌వ‌డం ఖాయం.. ఇప్పుడు కొంటే మీ పంట పండిన‌ట్లే