
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో కుల రాజకీయం నడుస్తోందని విమర్శించారు. నేడు కార్మిక దినోత్సవం సందర్భంగా రవీంద్రభారతిలో తెలంగాణ కార్మిక శాఖ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా మల్లారెడ్డి మాట్లాడుతూ.. ఏపీ కమ్మ, కాపు, రెడ్డి అంటూ నాయకులు రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలను నాయకులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు కట్టేది.. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కాపాడేది కేసీఆరేనని అన్నారు.
సీఎం కేసీఆర్ పవర్ ఏమిటనేది అందరికీ తెలుసునని అన్నారు. పక్క రాష్ట్రాల వాళ్లు కేసీఆర్ లాంటి సీఎం కావాలని చూస్తున్నారని చెప్పుకొచ్చారు. బీజేపీ, కాంగ్రెస్ నాయకులు కేసీఆర్, కేటీఆర్‌లను తిడుతున్నారనీ వారు తమ ఉసురు కొట్టుకుని పోతారని కామెంట్ చేశారు.