మందు పార్టీ ప్రచారంపై స్పందించిన మంత్రి మల్లారెడ్డి.. ఆయన ఏమన్నారంటే..?

Published : Oct 10, 2022, 03:21 PM IST
 మందు పార్టీ ప్రచారంపై స్పందించిన మంత్రి మల్లారెడ్డి.. ఆయన ఏమన్నారంటే..?

సారాంశం

మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి మల్లారెడ్డి విందు కార్యక్రమంలో మందు బాటిల్‌‌తో ఉన్న ఫొటో సోషల్ మీడియా వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మందు పార్టీ ప్రచారంపై మంత్రి మల్లారెడ్డి స్పందించారు.

మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి మల్లారెడ్డి విందు కార్యక్రమంలో మందు బాటిల్‌‌తో ఉన్న ఫొటో సోషల్ మీడియా వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఫోటోను, వీడియోను షేర్ చేస్తున్న బీజేపీ, కాంగ్రెస్ శ్రేణులు మంత్రి మల్లారెడ్డిపై తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే మందు పార్టీ ప్రచారంపై మంత్రి మల్లారెడ్డి స్పందించారు. గుండ్లబావిలో తన బంధువుల ఇంటి విందుకు వెళ్తే.. కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తప్పుడు ప్రచారంతో తనను ట్రోల్ చేస్తున్నారని అన్నారు. తన బావలు, సోదరులకు మందు పోస్తే తప్పేముందని ప్రశ్నించారు. బీజేపీ, కాంగ్రెస్ నాయకులు కావాలనే తమపై దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. 

అక్కడ వందల మంది లేరని.. ఐదుగురు మాత్రమే ఉన్నారని చెప్పారు. బావలు, సోదరుల వద్ద కూర్చుంటే కూడా ఇంత పబ్లిక్ చేయడం ఏమిటని ప్రశ్నించారు. అసలు ఎవరూ ఫొటో తీశారో తనకు తెలియదని చెప్పారు. బంధువుల ఇళ్లలోకి పోవద్దా..? అని ప్రశ్నించారు. తినడానికి భోజనానికి పిలిచారని.. వాళ్లకు మందు పోశానని చెప్పారు. ఆ ఊరి ప్రజలు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను తరిమి కొడతామని అంటున్నారని చెప్పారు. 

వివాదాల జోలికి వెళ్లను నా పని నేను చేసుకుంటానని చెప్పారు. రాజగోపాల్ రెడ్డి సర్పంచ్‌లను కొంటున్నారని ఆరోపించారు. మునుగోడులో బీజేపీ గెలిచే అవకాశం లేదని అన్నారు. కాంట్రాక్టుల కోసమే రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరారని ఆరోపించారు. మునుగోడులో టీఆర్ఎస్ కచ్చితంగా గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇక, మునుగోడు ఉప ఎన్నికలో మంత్రి మల్లారెడ్డికి చౌటుప్పల్​ మండలంలోని పలు గ్రామాల ఇన్​చార్జి బాధ్యతలు అప్పగించారు.

PREV
click me!

Recommended Stories

డిసెంబ‌ర్ 31న పెగ్గు వేద్దాం అనుకుంటున్నారా.? రూ. 10 వేలు ఫైన్, 6 నెల‌ల జైలు శిక్ష త‌ప్ప‌దు!
హైదరాబాద్‌లో 72 అంత‌స్తుల బిల్డింగ్‌.. ఎక్క‌డ రానుందో తెలుసా.? ఈ ప్రాంతంలో రియ‌ల్ బూమ్ ఖాయం